ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలతో ఏకధాటిగా పడిన వర్షాల వల్ల అనూహ్యంగా పెరిగిన భూగర్భ జల మట్టాలు భానుడి ప్రతాపంతో అడుగంటిపోతున్నాయి. రాబోయే ఖరీఫ్ లో సాగు ఫై భారీ అంచనాలు పెట్టుకున్న రైతులు ఈ ప్రమాద ఘంటికలుగా భావిస్తున్నారు. బోరుబావుల కింద ఎక్కువగా భాగం పంటను సాగు చేస్తున్న రైతులకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తీరు ఆశానిపాఠంగా మారనుంది. యాసంగిలో పుష్కలంగా నీరు అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్హునా పంటలు వేసిన రైతులు ఉత్సాహంగా ఖరీఫ్ లోను ఆరుగళం శ్రమించాలని బీడు వారిన భూములను మల్లి దుక్కి దున్ని చేసి సాగుకు సిద్ధమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాటికే భూగర్భ జలాలు ఘననీయంగా తగిపోవడంతో రాబోయే కొద్దీ రోజుల్లోనే బోరుబావుళ్ళని వట్టిపోతని రైతులు ఆందోళనతో ఉన్నారు.