Amitsha chalo Andhrapradesh
amit shah image

ఆంద్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ తో తెగతెంపులు కావడంతో ఆ రాష్ట్రంలో పార్టీ ప్రాబల్యం పెంచే కార్యాన్ని బీజేపీ అధినేత అమిత్ షా మొదలు పెట్టారు. కొంత మంది ముఖ్యనేతలతో షా శనివారమే ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు . రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టత ఎలా పనిచేయాలో దిశా నిర్దేశం చేసారు . సమీప దూరం లోనే షా బృందం ఏపీ ఫై దండెత్త దానికి స్పష్టమైన సంకేతాలు వచ్చేసాయి ….2014 సాధారణ ఎన్నికలతో మొదలైన బీజేపీ టీడీపీల మొదలైన స్నేహం నాలుగేళ్లు సవ్యంగానే సాగింది ఇంకా స్పష్టం అసలు వెంకయ్య నాయిడు కేంద్ర మంత్రిగా మోడీ అంతరంగికుడుగా ఉన్నన్నిరోజులు అసలు రెండుపార్టీల మధ్య ప్రణయం కొనసాగింది హోదా ఊసెత్తకుండా అందుకు సమానమైన ప్యాకేజి ని కేంద్రం ప్రకటిస్తే మోడీ & వెంకయ్య లను ఇదే చంద్రబాబు ఆకాశందాకా ఎత్త్తారు .

బాబు తాలూకు మీడియా అయితే ఆహా హోహో అంటూ బాకా ఉదాయి . అంతా సవ్యంగా సాగుతున్న వేళా మోడీ  ఓ మంచి ముహూర్తానా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆత్మీయుడిగా ఉన్న వెంకయ్య ను ఉప రాష్ట్రపతి గా పంపారు అంతే రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణలు తారుమారు అయిపోయాయి. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ హోదా ను మరోమారు తెరమీదికి తెచ్చారు . ఆమ్మో ! తామెక్కడ వెనుక బడిపోతామో నని టీడీపీ సైతం అదే పాట అందుకుంది. మధ్యలో జనసేనాని పవన్ హోదా అవసరాన్ని హోరెత్తించారు . మరోవైపు కేంద్రం వై సి పి నేతలకు వరసగా అపాయింట్ మెంట్ ఇవ్వడం బాబు ఎంతమాత్రం మింగుడు పడలేదు.ఇదేగాక ఏపీ లోని బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వం ఫై ఎదురుదాడులు మొదలు పెట్టారు. ఇవన్నీ ఒకెత్తు అయితే మోడీ అపాయింట్ మెంట్ దొరకడమే కష్టం అయింది.ఈపరిణామాలే రెండు పార్టీల మధ్య దూరం పెంచాయి . సరే బాబు ను మోడీ దూరం పెట్టడానికి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

ఆంధ్రజ్యోతి చెప్పినట్లు మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నపటినుంచే బాబు అంటే పడదట . ఎందుకంటే గోద్రా అల్లర్లు జరిగినప్పుడు మోడీ ని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించేయాలని ఈబాబు లోల్లి చేసాడట . ఒకే బాబు కు హోదా తాలుకు అపఖ్యాతి రాకుండా ఆపత్రిక ఆపసోపాలు పడుతుంది . పోనిలే అసలు గుట్టు ఎప్పుడో ఓసారి బయటికి వస్తుంది. బలమైన కారణాలు ఏవైనా ఉండచ్చు కానీ హోదా ఇవ్వని నెపంతోనే బీజేపీ తో టీడీపీ మరోమారు తెగతెంపులు చేసుకుంది ఇక ఆంద్రప్రదేశ్ లో బీజేపీ టీడీపీ ల మధ్య అక్కడి రాజకీయాలు వేడెక్కుతాయని అంతా భావించారు .

కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుంటూరులో పార్టీ ప్లినరీ సమావేశాల వేదిక పైనుంచి బాబు , చినబాబు లపై తీవ్రమైన ఆరోపణలే చేసాడు . ఇప్పట్లో ఆ చిచ్చు చల్లరేలా లేదు . సో బీజేపీ తన కార్యసాధన మొదలు పెట్టింది. మొన్నటిదాకా ఏపీ లో పార్టీని బలోపేతం చేసుకోలేక పోయింది. ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడితే టీడీపీ తో పొత్తుకు విఘాతం కలుగుతుందని బీజేపీ అగ్ర నేతలు వెనుకడుగు వేశారు. ఇప్పుడు ఆపార్టీ కేంద్రంలోనుంచి వెళ్లి పోయింది. కదా ఇంకేం అపరేషన్ ఆకర్ష్ మొదలైనట్లే ఎన్నికలకు ఏడాది సమయం ఉంది కదా . పార్టీ ని ఉన్నపళంగా విస్తరించాలని షా బృందము తహ తహ లాడుతుంది ఎలాగో ఏదోఒక ప్రధాన పార్టీ తో పొత్తు ఉండనే ఉంటుంది కదా తమకు అవకాశం ఉన్న స్థానాల్లోనే బలం పెంచుకోవాలనేది కమలనాధుల ఆలోచనగాఉంది .