తమ ప్రయోజనాల కోసమే పనిచేయాల్సిన సంఘాలు ఒకరిద్దరి రాజకీయ అవసరాలు తీర్చే అడ్డాలుగా మారుతుండడం ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యోగం తోపాటు యూనియన్ లోనూ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పు కోవాల్సిన వారు పిశాచులగామారి సంఘమును పట్టుకొని వేలాడుతున్నారు. దీనితో ఇప్పటి నాయకత్వం ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండి పోతున్నారు పైగా యూనియన్ తమదైన ముద్రను వేసుకోలేక పోతున్నారు ఇంకా ఆ వృద్ధ నేతల చాటు నే యూనియన్ లో మనుగడ సాగించాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యోగసంఘాల పాత్ర ఎప్పటికి మర్చిపోలేనిది. కానీ ఇదే ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని కొందరు యూనియన్ నేతలు రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తారు. అధికార పార్టీ కి బానిసలుగా మారిపోయారు. ఉద్యోగుల ప్రయోజనాలను పక్కనపడేసారు.

అందలం ఎక్కడానికి అర్రలు చాచారు. అందుకు అధికార పార్టీకి అండగా నిలిచారు సరే ఎదో సుదీర్ఘకాలంగా యూనియన్ నేతలుగా పనిచేసారు కాబట్టి అందులోను తమకు వీరవిధేయులుగా ఉండడంతో ఒక్కొరికి ఒక్కో అవకాశం ఇచ్చింది అధికార పార్టీ. అదేక్రమంలో కొందరు అందలం ఎక్కేసారు కొందరికి అవకాశం వచ్చిన ఎన్నికల్లో ఓడి పోవడంతో అందలం ఎక్కే ఛాన్స్ దక్కలేదు. ఇంత వరకు బాగానే ఉంది కానీ యూనియన్ నాయత్వంలో ఉంటూనే ఉద్యోగం వదిలేసి ఓ పార్టీ కండువా కప్పుకొని రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నేతలు నైతికవిలువలప్రకారం యూనియన్ లనుంచికూడా వైదొలగాలి. కానీ ఏఒక్కరు ఆ పని చేయలేదు. యూనియన్ తమ చెప్పు చేతుల్లో ఉంటేనే అధికార పార్టీ లో తమ ప్రాబల్యం ఉంటుందని భావించారు. తమ కాను సైరల తో పనిచేసే వారికే నాయకత్వం అప్పగించి వారితోనే బైలాను సవరించి గౌరవ అధ్యక్షుడి యూనియన్ ను శాశ్వతంగా తమ చేతుల్లో కి తీస్కున్నారు.

ఇదంతా అధికార పార్టీ అగ్ర నేతల ఆడించిన నాటకమే. పోనిలే ఏళ్ళ తరబడిగా యూనియన్ నీడలో దర్జాగా కాలం వెళ్లదీసిన వారు పార్టీలో ఎదో పబ్బం గడుపుతారని ఉద్యోగులు మొదట భావించారు. కానీ వాళ్లే ఇప్పుడు యూనియన్ లకు గుదిబండలవుతారని అనుకోలేదు. పార్టీలో ఉండి అందలం ఎక్కి ప్రభుత్వ పెద్దల ముందు నోరెత్తని పరిస్థితిలోకి వారు వెళ్లి పోయారు. ఈ వృద్ధ నేతలను కాదని ఇప్పుడు నాయకత్వంలో ఉన్నవారు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అసలు వారిని కాదని ప్రభుత్వపెద్దలను కలిసే పరిస్థితిలో లేదు. ఏదైనా తెగించి ఓ అడుగు ముందుకు వేసి వెళ్లిన కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరక్కుండాఈ వృద్ద నేతలు అంతటా కట్టడి చేసిపెట్టారు. మరో నేత తన సామజిక వర్గానికి చెందిన ఒకరిద్దరి కలిసి సీఎంఓ కు తమ యూనియన్ నేతలు అడుగు పెట్టకుండా జాగ్రతపడుతున్నారు. అందుకే చాలామంది యూనియన్ నాయకులకు నేరుగా సీఎం ను కలిసే అవకాశం రావడం లేదు.

అందుకే ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం లేదు పైగా ఉద్యోగసంఘాలకు ప్రభుత్వానికి మధ్య దూరం క్రమేపీ పెరుగుతోంది. ఉద్యోగుల సమస్యల ఫై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి మొదలయింది. ఈమద్యే హైదరాబాద్ లో ఉద్యోగుల సభ కు ఓ నేత డుమ్మా కొట్టగా మరో నేత మాట్లాడేటప్పుడు జరిగిన రచ్చ అంత ఇంత కాదు. సదురు నేతను ఉద్దేశించి సభకు వచ్చిన ఉద్యోగులు వాడిన పరుష పదజాలం వినీ ఓ ఇంటిలిజెన్స్ రికార్డ్ చేసి ఉన్నతాధికారులకు నివేదించారట. ఉద్యమకాలం నుంచి దోస్తీ ఉండడం తో సీఎం కెసిఆర్ సయితం ఉద్యోగుల విషయం ఏదున్నా ఈ వెటరన్ నేతలనే సంప్రదిస్తున్నారు. అదే ఇప్పుడున్న నేతలకు మింగుడు పడడంలేదు. ఎలాగో యూనియన్ లు తమ చెప్పు చేత్తుల్లోన్ ఉండడం తో వెటరన్ నేతలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తమని ధిక్కరించే వారిని అధోగతి పాలు చేయడంలోనూ ఈ వెటరన్ లు ఎంతో నిష్ణాతులు.

ముందుగా ఉద్యోగం ఊడబీకేసీ ఆ తర్వాత యూనియన్ లో నుంచి వెళ్లగొట్టేస్తారు. అప్పటికి ఆగకుండ పోలీస్ కేసులతోనూ వేధించిన ఉదంతాలు ఉన్నాయి. లక్షలాదిమంది ఉద్యోగుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి తమ పబ్బం గడుపుకుంటూ యూనియన్ లా ప్రతిష్టను మంటగల్పుతున్నారు. తమని అమ్మలా ఆదరించిన సంఘాలకె మచ్చతెస్తున్నారు.ఎలాగో అధికారపార్టీలో చేరి అందలం ఎక్కి ఉరేగుతున్నవారు ఇంకా యూనియన్ లను పట్టుకొని ఉండడం పైనే ఉద్యోగులు అభ్యతంతరం.