ఎంత కష్టమైన నేను ఇచ్చిన మాట తప్పను …..ఎందుకంటే నేను మనిషిని ..ఐ ఆమ్ లివింగ్ ఇన్ సొసైటీ …ప్రతిఒక్కరికి భయం భాద్యత ఉండాలి…. వర్తమాన రాజకీయాల్లో దిగజారిపోతున్న విలువలే ప్రధానంగా రాజకీయ ఇతివృత్తంతో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గ వస్తున్న భరత్ అనే నేను రూపొందిస్తున్నారు. మాటల రచయితగా వచ్చి దర్శకుడిగా మిర్చి , బృందావనం ,శ్రీమంతుడు వంటి హిట్ సినిమాలు చేసిన కొరటాల శివ నే ఈ సినిమాకు దర్శకుడు. మహేష్ బాబు ఇందులో ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. అదీ… ఆంధ్రప్రదేశ్ కు. సాదారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సినిమా మంచి టైమింగ్ లోనే వస్తుంది …సినిమా హిట్ అవుతుందా ?లేదా అనేది పక్కన పెడితే రాజకీయాలు పూర్తిగా బ్రష్టు పట్టిపోతున్న వేళా ఈ సినిమా నేతలకు కనువిప్పు కలిగించేలా ఉంటాడట.

ఇటీవలే ఈ సినిమా ట్రయిలరు విడుదల చేసారు. కేవలం రాజకీయసంభాషణలే ఉన్నాయి. దీనితో ఈ సినిమా కేవలం రాజకీయాల చుట్టే ఉంటుందని అర్థం అవుతుంది.కానీ అందులో మహేష్ బాబు చెప్పు పదునైన డైలాగులు.అవే ఇప్పుడు హాట్ టాపిక్ ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఈ డైలాగులు రాసారనేది చర్చ.

Bharath Ane Nenu logo
Bharath Ane Nenu logo

మహేష్ తండ్రి హీరో కృష్ణ టీడీపీ అధినేత ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి సినిమా చేసారు అయన కాంగ్రేస్ పార్టీ తరపున ఎంపీ గా పోటీచేశారు..కృష్ణ గతంలో వై ఎస్ ఆర్ సి పి కి మద్దతుగా నిలిచారు. కానీ మహేష్ ఈ సినిమాలో వాటిజోలికి వెళ్లకుండా కేవలం నాయకులనే లక్ష్యంగా చేసుకున్నారట .

ఎన్నికల్లో నాయకులు ఓట్ల కోసం ప్రజలు వద్దకు వెళ్లి ఎన్నో హామీలు ఇవ్వడం …ఆ తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడం ఐదేళ్లు ఇట్టే గడిపేయడం ఎన్నికలకు ముందే ఎదో హడావుడి చేయడం మళ్ళీ హామీ ఇవ్వడం ఎన్నికల్లో గట్టెక్కడం ఇదే తంతూ …అందుకే సమస్యలు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి . అందుకే మొదటిసారిగా రాజకీయాలే ఇతివృత్తంగా మహేష్ భరత్ అనే నేను తో వస్తున్నారు.

చిన్నపుడు మా అమ్మ ఒకమాట చెప్పేది ..ఇచ్చిన మాట తప్పేవాణ్ణి అసలు మనిషే అనరట …..జీవితంలో మాట ఇచ్చే రోజు వచ్చింది ..అదీ పెద్దదీ కాదు కష్టమైంది కాదు ….ఇలాంటి డైలాగులున్నాయి. ఇవి ఎవరికీ తగులుతాయో …ఇచ్చిన హామీ నీ నిలబెట్టుకొక పోవడంనేటి తరం నేతలకు ఫ్యాషన్ అయిపోయింది.హోదా మాటున ఆంద్రప్రదేశ్ లో రాజకీయాలు హోరెత్తి పోతున్నాయి .ఇలాంటి కీలక సమయాన వచ్చే ఈ సినిమా ఫై దుమారం రేగడం ఖాయం.