మూడు ఈశాన్యరాష్ట్రాల్లోఎన్నికలఫలితాలు దేశరాజకీయాల్లో కీలక మార్పుకు నాంది కాబోతున్నాయి ప్రధానరాజకీయపార్టీలకోటలు బద్దలయేవిధంగా ఆరాష్ట్రప్రజలు తీర్పు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ప్రతిష్టమసక బారుతుందని ప్రచారం జరుగుతున్న తరుణంలోశనివారం వచ్చిన ఫలితాలు బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఇసేత్తూ తగ్గలేదని స్పష్టం అయింది మోడీకి తిరుగులేదని తేలిపోయింది మూడు రాష్ట్రల్లో మొత్తం 158 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 75స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది సుమారు 50శాతం మేరకు సీట్లు సాధించారు.

ఇదేమిఆషామాషీకాదు సీపీఎంపార్టీకంచు కోటను కమలంపార్టీ బద్దలు కొట్టింది త్రిపురరాష్ట్రంలో ఆపార్టీ 25 ఏళ్లుగా అధికారంలోఉంది మచ్చలేనివ్యక్తిగాఉన్న మాణిక్ సర్కారు ముఖ్యమంత్రిగాసమర్థవంతఁగా పనిచేస్తూవచ్చారు. ఈసారిమళ్ళీ ఆయనే సీఎం అవుతారని అంతాభావించారు. కానిఏడాది క్రితంనుంచే బీజేపీ ఆరాష్ట్రఫై గురి పెట్టింది అగ్రనేత రామ్మాధవ్ ను రంగంలోకి దించింది. మాణిక్ మంచోడే అయినా మంత్రులవిచ్చలవిడి అవినీతి ఫై ప్రజల్లో అసంతృప్తి మొదలయింది దాన్నే బీజేపీ బాగా ఉపయొగించుకుంది. అనుదువల్లే ఒక్కసీటులేని పరిస్థితిల్లో ఇప్పడు ఏకంగా 42 స్థానాల్లో విజయంసాధించింది. 55 స్థానాలతోఇదివరకు అధికారంలోకి వచ్చినసిపిఎంఈసారి17 స్థానాలకు పరిమితంఅయ్యింది. నాగాలాండ్ లోను ఆపార్టీమంచి ఫలితాలు సాధించింది. మేఘాలయాలో మాత్రంఅనుకూల ఫలితాలు రాలేదు.

కాంగ్రెస్ పార్టీ అధికారం నిలబెట్టుకోలేకపోయినగట్టి పోటీనే ఇచ్చింది. ఈ రాష్టంలోఇతరులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ పావులు కదుపుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాలుఎలాఉన్నా మోడీ ఇమేజ్ మసక బారుతుండడంతో ఎన్ డి ఏ లోని భాగస్వామ్యపక్షాల పునరాలోచనలో పడ్డాయి. టీడీపీతో పాటుతెరాస లాంటి పార్టీలు పార్లమెంట్ సమావేశాల్లో లొల్లీ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. రెండు రాష్ట్రాలముఖ్యమంత్రులుమోడీ ఫై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ ఫలితాలు ఆపార్టీలావ్యూహాలు మారేఅవకాశంఉంటది.