ఒకే …ఒకే ప్రజల్లో మోడీపై భ్రమలు తొలిగి పోయాయి . ఔను మోడీ ప్రతిష్ట మసకబారుతుంది. నిజమే ..నోట్ల రద్దు ,జి ఎస్ టి లాంటి చర్యలతో విసిగెత్తి పోయారు..నల్లకుబేరుల అట కట్టించలేదనే వాదన కరక్టే మొత్తానికి మోడీ దేశానికి ఎదో ఉద్ధరిస్తాడనే ఆశలు సన్నగిల్లి పోయాయి అన్ని అక్షర సత్యాలే ….అయితే ఏమైంది అవును ఆపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఉప ఎన్నికల్లో ఓడిపోతుంది .ఇంకా చెప్పాలంటే దశాబ్దాలుగా గెలుస్తున్న ప్రాంతాల్లోనే పరాజయాలు ఎదురవుతున్నాయి ….కానీ ఢిల్లో బీజేపీ కి ప్రత్యామ్న్యాయంఉన్న తామే ఇక అధికారంలోకి వస్తామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంతకన్నా దయనీయంగానే ఉందికదా? కేవలం మూడు రాష్ట్రలకే పరిమిత అయింది .

ఇటీవలే యూపీ లో రెండు లోకసభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే ఆపార్టీ కనీసం డిపాజిట్ దక్కించుకోలేదు. కేవలం 2 శాతం ఓట్లు సాధించింది . మరి 2019 లో జరిగే ఎన్నికల్లో ఆపార్టీ సానుకూల ఫలితాలు సాధించే పరిస్థితి కనుచూపుమేరలో లేదు. కేవలం మోడీ వైపల్యాల మీదే ఆపార్టీ ఆశలు పెట్టుకున్నది.కేవలం ఉపఎన్నికల్లో ఓడిపోతేనే బీజేపీ పని అయిపోయిందని భావిస్తున్న ఆపార్టీ అనేక రాష్ట్రాల్లో తుడిచిపెట్టకపోయింది కదా పోనీ యూపీఏ లో ఉన్న పార్టీలైన నెగ్గుకొస్తాయా ? అదీ గ్యారెంటీ లేదు తమిళనాడులో డీఎంకే బెంగాల్ లో మమతా మహారాష్ట్రలో శరధ్ పవర్లు వారి రాష్ట్రల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కుంటున్నారు.

అఖిలేష్ ,లాలు లాంటి వారే కాంగ్రెస్ కు  పెద్దదిక్కు కాన్నున్నారు మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మద్యే థర్డ్ ఫ్రంట్ ను తెరమీదికి తెచ్చాడు కెసిఆర్ కూడా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసాడు యూపీఏ లోని కీలక పక్షాలను తన వైపు లగే యత్నాల్లో ఉన్నారు. అదే విషయం తెలిసి సోనియాగాందీ రంగం లోకి దిగారు. విందు పేరుతో అన్ని పక్షాలను పిలిచారు. ఇప్పుడు ఉన్నపళంగా ప్రాంతీయ పార్టీ లతో జత కట్టడం కాంగ్రెస్ పార్టీకి అనివార్యం అయింది . పార్టీ అధ్యక్షునిరాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తోలి ప్లినరీ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి.బీజేపీ ని గద్దె దించడమే లక్ష్యంగా పార్టీ కార్యాచరణ ను ఈ వేదిక నుంచే ప్రకటించాలిసింది.

పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు అలాగే భవిషత్తు పొత్తుల ఫై విధానం ఖరారు చేయనున్నారు .అధ్యక్షుడిగా ఇప్పటికే అనేక సవాళ్ళను ఎదుర్కుంటున్నారు .ఆయా రాష్ట్రాల్లో పార్టీ అధికారం కోల్పోయి డీలా పడిపోయింది కొంతలోకొంత గుజరాత్ లో బీజేపీ ని నిలువరించారు ఈ ఎన్నికలతోనే పార్టీ క్యాడర్ లో రాహూల్ ఫై ఆశలు చిగురించాయి.ఉప ఎన్నికల పలితాలతో బీజేపీ లోను ప్రకంపనలు మొదలయ్యాయి . కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనే ప్రజలు తిరస్కరించడం ఆపార్టీ అగ్రనేతలకు మింగుడు పడడం లేదు.ఈ పలితాలతో విపక్షాలు మరింత బలపడే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం ప్రాబల్యం పెంచుకునే అవకాశం ఉంది . కలిసివచ్చే కొత్త స్నేహితుల కోసం ఎదురు చుసేపనిలో ఉంది.మరో వైపు పార్టీకి సంస్థాగత ప్రక్షాళన అవసరం ఉంది .ఢిల్లీ ఆదేశాలతో కాకుండా స్వతహాగా పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లే వారికీ నాయకత్వం ఇవ్వాలి .