ఓవైపు దేశంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలని చెపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్!  రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై కాగ్ ఇచ్చిన నివేదిక తర్వాతకూడా మనది పేదరాష్ట్రమా ?ధనిక రాష్ట్రమా?తేల్చుకోవాలిసిన పరిస్థితి ఉంది . కాగ్  (CAG)రూపొందించిన నివేదికను ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది . కానీ దీనిపై ఎలాంటి చర్చకు తావులేకుండనే సభా నిరవధికంగా వాయిదాపడింది. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఎంత దయనీయంగా ఉందొ “కాగ్” కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పింది మనది మిగులు రాష్ర్టం కాదు లోటు రాష్ట్రం అని తెగేసి చెప్పింది .పాలకుల పల్లికి మోసేపనిలో ఉన్న మీడియా కూడా ఎప్పటిలాగే కాగ్ నివేదిక ఫై చూసీచూడనట్లుగా ఉంది . మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ పక్షనేత కిషన్ రెడ్డీ ఇవే అంశాలను ప్రస్తావించారు.

కానీ కెసిఆర్ ఆయనపై ఒంటికాలు మీద లేచాడు అప్పులు ఆర్థిక పరిస్థితులపై సుదీర్ఘ ఉపన్యాసమే చేసారు . అప్పులు చేయడం తనతోనే మొదలు కాలేదు . ఆర్ బి ఐ (RBI) నియమావళి ప్రకారంగానే అప్పులుచేస్తున్నాం. అవికూడా అవసరం మేరకే చేస్తున్నం . ఏ మోడీ చేస్తాలేడా అంటూ ఎదురుదాడి చేసారు సో ఆరకంగా ఆ అంశాన్ని కెసిఆర్ క్లోజ్ చేసారు కానీ కాగ్ చెప్పిన విషయాలు చుస్తే ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది .

1) ముఖ్యంగా ద్రవ్యలోటు ఆందోళనకరంగా పెగిపోయింది ఎఫ్ ఆర్ బీ ఎం చట్ట ప్రకారం ద్రవ్యలోటు 3.5% ఉండాలి కానీ ఇది ఎప్పుడొ దాటిపోయింది.

2) మొత్తం ఖర్చులో 69% రెవెన్యూ వ్యయం అవుతుంది మిగితా 31శాతమే మౌలిక వసతులు ,ఆస్తుల కల్పనలో పెట్టుబడులకే సరిపోతుంది .

3)ఎస్సి సబ్ ప్లాన్ లో కేటాయించిన నిధుల్లో 60 శాతం , ఎస్ టి సబ్ ప్లాన్ 58 శాతం నిధులు వినియోగించ లేదని ఇది చట్టాన్ని నిర్లక్ష్యంచేయడమే.

4) ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో 34.74 శాతం పాత అప్పులు తీర్చడానికే వెచ్చిస్తున్నారు.

5) నాలుగేళ్లలో విద్యుత్తూ రంగాన్ని ఎంతో ఉద్దరించామని సర్కార్ చెప్పుతూ వచ్చిందికదా కానీ అడ్డగోలుగా విద్యుత్తు కొనుగోళ్లు జరిగాయని ఈ ఆర్ ర్సీ లు విధించిన పరమితి కన్న ఎక్కువ ధర కు విద్యుతు కొనుగోలు చేసారు దీనివల్ల రు.5 820 .90 కోట్ల అధిక వ్యయం అయింది.అదీగాక నాణ్యత లేనిదీ .

6) సీఎం నిర్వహణలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ తోపాటు స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ లో వేయి కోట్ల కు పైగా అవకతవకలను కాగ్ బట్ట బయలు చేసింది.

7) విద్యా ,వైద్య రంగాలలో ప్రభుత్వం కనీస పురోగతి ని చూపడం లేదనేది కాగ్ ముక్కు మీద గుద్ది నట్లుగా చెప్పింది.

ఇక ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పే పారిశ్రామిక విధానంలో లోపాలను కాగ్ ఎత్తి చూపింది . సింగిల్విండో వెస్ట్ అంది . ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ ను కాగ్ ఎగతాళి చేసింది . ఇందులో డబ్బు విచ్చల విడిగా వెస్ట్ అవుతుంది . ఎదురు దాడి చేయడం లో నిష్ణాతులు ఎంతో మంది అందుబాటులో ఉన్నారు కదా సో …..కాగ్ ఇచ్చిన నివేదిక అందులోని అంశాలను ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకుంటుంది. ఇక శాసనసభ్యుల వ్యవహారంలోనే కుదేలైన కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో బయటికి రాదు వచ్చి ఏదైనా గట్టిగ మాట్లాడితే కూల్ చేయడానికి జానా సార్ రెడీ ఉన్నాడు లేండి ఏమి టెన్షన్ వద్దు.