హోదా కాదు కదా అసలు నయాపైసా ఇవ్వం. ఇచ్చినవాటికే ఇప్పటికి లెక్క ఇవ్వలేదు. మీరు ఎన్ని ఉద్యమాలైన చేయండి సెంటిమెంట్ పనిచేయవు. అంటూ కేంద్రం  మంగళవారం కుండబద్దలు కొట్టింది దీనితో మూలిగే నక్కమీద తాటి కాయ పడ్డట్లు అయ్యింది బాబు పరిస్థితి. ఇకకేంద్రంతో ఎదో ఒకటి తెచ్చుకొనే పరిస్థితిలోకి బాబు వచ్చేసారు.కేంద్రం ఫై ఆశలు పూర్తిగా సన్నగిల్ల పోయాయి.

ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్ని పక్షాలు ఏకం అయి ఆందోళనలు జరుగుతున్నయి. పార్లమెంట్ వేదికపైన లోల్లి అవుతున్నది మిత్రపక్షమైన టీడీపీ అక్కడ అధికారంలో ఉంది ఓరకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడిలో ఉన్నారు. మరోవైపుప్రబుత్వంలోనుంచి బయటకు వచ్చేస్తామని ఢిల్లీ పెద్దలకు సంకేతాలు పంపించారు. అయినా మొండి మోడీ పట్టించుకోలేదు సరే ఆయన ఏదన్నా పనిలో ఉండొచ్చని టీడీపీ పెద్దలు భావించారు కాని వారి కళ్ళు బైర్లు కమ్మేలా కేంద్రం నుంచి ఓ ప్రకటన వచ్చింది. హోదా ఇవ్వడం కుదరదు ప్యాకేజి మేరకు నిధులే ఇస్తాం ఆంతేకాదు పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు ఇవ్వడం కుదరదు అంటూ ఏపీ ప్రతినిధులకు స్పష్టం చేసారు. అసలు ఇప్పటిదాకా ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని హుమ్కరించింది.టీడీపీ ఇప్పుడువైఖరిఎలా ఉండబోతుందో చూడాలి ……