తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలో కాంగ్రేస్ పార్టీ మొదటి రోజే క్లిన్ బోల్డ్ అయింది. ఆత్మ రక్షణలో పడిపోయింది. ఈ సమావేశంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయి విరుచుక పడాలని ఎన్నో వ్యహరచనలు చేసింది. ఆపార్టీ ఎలాంటి ఎత్తులనైనా చిత్తు చేసే నైపుణ్యం కెసిఆర్ కు ఉంది ఒకరోజు ముందే తెరాసశాసనసభ్యుల సమావేశం లో నే వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలి అంటూ హితబోధ చేసారు. ఎన్నో ప్రజాసమస్యలపై గళమెత్తాలని భావించిన కాంగ్రేస్ పార్టీ కి కోమటిరెడ్డి రూపంలో అపశకునం ఎదురయింది.

గవర్నర్ రెండు సభలను ఉద్దేశించి మాట్లాడే టప్పుడు సహజంగానే కాంగ్రేస్ పార్ట్ సభ్యులు లొల్లి చేసారు మార్షల్స్ తో వారు గవర్నర్ వైపు రాకుండా కట్టడి చేసారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు ప్రసంగప్రతులను చించి వేశారు . ఇక్కడి బాగానే ఉంది. కానీ కాంగ్రేస్ శిబిరంలో కెసిఆర్ టార్గట్ గా ఉన్న కోమటిరెడ్డి సహనం కోల్పోయి ఫోన్ హేడ్ సెట్ గవర్నర్ వైపు విసిరివేసాడు. అది గవర్నర్ పక్కనే ఉన్న శాసన మండలి చైర్మెన్ స్వామిగౌడ్ కంటిపై భాగంలో తగిలింది. గతంలో అచ్చం ఇలాగే హరీష్ కూడా కుర్చీఎక్కి గవర్నర్ వైపు పేపర్ లు చించి విసిరాడు . అప్పుడంటే ఉద్యమం మాటున ఏది చేసిన చెల్లు బాటెఅయింది.

దానికి తోడు హరీష్ చేసింది ముమ్మాటికీ కరక్టే అంటూ తెరాస ఎదురు దాడికి దిగింది . కానీ ఇది కాంగ్రేస్ పార్టీ అంత దమ్మున్న వారుఎవరున్నారు. పైగా ఇపుడు ప్రభుత్వంలో ఉన్నది తెలంగాణపై అన్ని హక్కులు పొందిన తెరాస పార్టీ కాబట్టి కోమటి రెడ్డి ఇష్యు ఇప్పుడు కెసిఆర్ చేతికి వెళ్లి పోయింది. కాంగ్రేస్ పార్టీ సర్దుకొనేలోపు తెరాస నేతల నుంచి ఎదురు దాడులు మొదలయ్యాయి. సామిగౌడ్ ఫై దాడి ని సర్కార్ చాలా తీవ్రంగా పరిగణిస్తుందని కఠిన చర్యలకు సిద్ధం అవుతుందని టీవీ ఛానళ్ల హంగామా ఇక తెల్సిందే కదా.

కెసిఆర్ ముందే కాంగ్రేస్ ఎదురు దాడి ని పసిగట్టాడు అందుకే ఓవర్ చేస్తే సమావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తామని టీ ఆర్ ఎస్ ఎల్ పి సమావేశంలోనే స్పష్టం చేసారు. అందివచ్చే ఏ అవకాశాన్ని కెసిఆర్ వదులుకోలేడు. ముందునుంచే కోమటి రెడ్డి అంటేనే కెసిఆర్ కు సానుకూలత లేదు. ఇక తెలిసిందే కదా మంగళవారం సభ లో ఏమి జరగనుందో చెప్పనవసరంలేదు. కనీసం ఓ ఏడాది సభకు రాకుండా కోమటిరెడ్డి కట్టడి చేయడం ఖాయం…మరో వైపు ఈ దాడి నీ ప్రజల్లో తీసికెళ్ళే ఆలోచనలో తెరాస ఉందట ఏకంగా బీసీ నుంచి ఇద్దరిని రాజ్యసభ పంపితే అదే బీసీ ప్రతినిది అయిన మండలి చైర్మెన్ ఫై దాడి చేస్తారా అంటూ తెరాస లొల్లి చేయబోతుంది