ఓర్నీ కొండత రాగంతీసి పసలేని పాటపాడినట్లు ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి . ఎప్పటిలాగే బస్సు పార్ములాను నమ్ముకుంది. ఎన్నికలప్పడు బస్సు యాత్ర ఆపార్టీ కి కలిసివస్తుంది సీనియర్ నేతల సన్నాయి నొక్కుల మధ్య ఈ నెల26నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. 2004 ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ నేత వై స్ చేసిన పాదయాత్ర రూట్ లోనే ఇప్పడు బస్సు యాత్ర చేయనున్నారు. 2009ఎన్నికల్లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా అలకపాన్పు ఎక్కిని సీనియర్ నేతలతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పడు ఉత్తముడు కూడా అదే పార్ములా ఫాలో ఔతున్నారు .

బాహుబలి లేనట్లేనా?—————– సాధారణ ఎన్నికలనాటికికాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి బాహుబలి వస్తారని ఆపార్టీ సీనియర్ నేత జానారెడ్డి యదాలాపంగా చెప్పారు కానీ ఆవ్యాక్యలపై తీవ్రదుమారం చలరేగింది బాహుబలి ఎవరైఉంటారని ఆపార్టీ నేతల్లో విస్తృతంగా చర్చ జరిగింది. సీనియర్ నేతలు కాస్త ఉలిక్కిపడ్డారు ఆతరువాతే టీడీపీ నేత రేవంత్రెడ్డి ముఖ్యనాయకులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనే బాహుబలి అవుతారని అంతా బావించారు కానీ రేవంతుకి అంతసీను లేదంటూ సీనియర్లూ లైట్ తీసుకొన్నారు ఆయన పాదయాత్ర పక్కనపడేసారు దీంతో రేవంత్ డు సైలెంట్ అయ్యాడు.

కానీ మరోసారి పార్టీని అధికారంలోకి తేవాలని తెరాస అధినేత కెసిఆర్ పట్టుదలతో ఉన్నరు అన్ని పార్టీలను బలహీనము చేసాడు ఈ తరుణంలో తిరుగులేని శక్తితో రంగంలోకి దిగాల్సి ఉండగా పసలేని ప్రసంగాలు చేసే నేతలతో మొదలవుతున్న బస్సు యాత్ర ఫై క్యాడర్లో ఎంతమాత్రం అంచనాలు లేవు అయినా అధికారంలోకి వస్తామనే ఆశతో బస్సుయాత్రతో ప్రజలతో మమేకం కావవచ్చనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కావచ్చు ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోఎండగట్టి పార్టీ ప్రాబల్యాన్ని పెంచుతామని ఆపార్టీనేతలు దీమాగాఉన్నారు