రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కరలేని నాయకుడు డి. శ్రీనివాస్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అయన ఇప్పుడు అధికార తెరాసలో ఇమడలేక పోతున్నారు. అసలు పార్టీ వీడిన ఆశ్ఛర్యం లేదని అయన సన్నిహితులు చెపుతున్నారు. ఈ నెల 13 నిజామాబాద్ లోనే తన మద్దతు దారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. భవిష్యత్ కార్యాచరణ వెళ్ళడవుతుందని సమాచారం. డీఎస్ఇటీవలే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. కానీ పార్టీలో ప్రభుత్వంలో తనకు కనీస ప్రాధాన్యత ఉండడం లేదని అధినేత కెసిఆర్ వద్ద కూడా మునుపటి ఆదరణ కరువైంది కొంత కాలంగా అయన చురుకుగా రాజకీయ కార్యకలాపాలు సాగించ లేక పోతున్నారు. రెండో తనయుడు అర్వింద్ ఇటీవలే బీజేపీలో చేరారు రాబోయే ఎన్నికల్లో అయన బీజేపీ అభ్యర్థిగా లోకసభకు పోటీచేసే ఆలోచనతో ఉన్నారు.

ఈమేరకు లోకసభ పరిధిలో విస్తృతంగా తిరుగుతున్నారు. సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అనతికాలంలోనే జిల్లా పార్టీలో తిరుగులేని ఆధిపత్యం సాధించారు. సరే అయన సంగతి ఆలా ఉంచితే…తెరాస లో ఉన్న డీఎస్ అగ్రనాయకత్వం ఫై చాలాకాలంగా అలకబూనారు. కనీస ప్రాధాన్యత లేకపోవడంతో ఆయనకుమింగుడు పడడం లేదు. విద్యార్థి దశలోనే కాంగ్రెస్ పార్టీ లో చేరి పార్టీ అంచలంచెలుగా ఎదిగారు. ఏం ఎల్ ఏ గా, మంత్రిగా పనిచేసారు మరోవైపు పార్టీలోనూ పట్టు సాధించారు రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఓదశలో ముఖ్యమంత్రి రేసు లోను నిలిచారు 2009 ఎన్నికల్లోఓడిపోవడమే ఆయనకు రాజకీయంగా దెబ్బతీసింది.
పార్టీలో అధిపత్యానికి తెర పడింది. 30ఏళ్ళ పాటు పార్టీ లో తిరుగులేని నేతగా ఉన్నారు.

కానీ ఏం ఎల్ సి అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అగ్ర నాయకత్వం అనుసరించిన తీరుతో రగిలి పోయారు. తీవ్రంగా మనస్థాపం చెందారు అప్పుడే తెరాస అధినేత కెసిఆర్ సంప్రదించడం తో రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీని వీడి తెరాస లో చేరారు. మొదటి ప్రభుత్వ సలహా దారునిగా తర్వాత ఎంపీ గా వెంటవెంటనే అయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడే విషయంలోనే తీవ్ర విమర్శలు ఎదురుకున్నారు. కానీ అక్కడ డీఎస్ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. ఆదరణ కరువయింది. ఓదశలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఈలోపు చిన్నకొడుకు అర్వింద్ బీజేపీ లో చేరారు. డీఎస్ కూడా మొదట బీజేపీ లోకి వెళ్తారని భావించారు కానీ తెరాస నేతలే రంగంలోకి దిగి డీఎస్ ను నిలువరించారు. కానీ అయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం మరింత ఎక్కువైంది.

దీనికి తోడునిజామాబాద్ జిల్లాకే చెందిన మాజీ మంత్రి డీఎస్ ను సంప్రదించడం చర్చనీయాంశం అయింది అర్వింద్ కు ఎంపీ టికెట్ భరోసా ఇవ్వడంతో పాటు పార్టీ లోను కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం కానీ డీఎస్ ససేమిరా అన్నాడట. మరి అర్వింద్ బీజేపీ టికెట్ ఫై ఎంపీ గా పోటీచేస్తే అప్పుడు డీఎస్ ఎటువైపు ఉన్నారనేది ఆసక్తిగా ఉంది. అసలు అయన అర్వింద్ ను కాదని ఒక్క అడుగు ముందుకు వేయడు. కవిత ఫై పోటీ చేసి ఎలాగైనా గెలవాలని అర్వింద్ పట్టుదలతో ఉన్నారు. కాబట్టి డీఎస్ చివరికి కొడుకు భవిష్య్తతు కోసం బీజేపీ లోకి వెళ్లడమే అనుచితం భావిస్తారు. బీజేపీ అగ్రనాయకత్వం అదే డిమాండ్ చేస్తుంది.