పంచాంగం చూసే పంతుళ్ళ మధ్య బేధాభిప్రాయాలవాళ్లే తెలుగునాట ఎంతో సంబరంగా జరగాల్సిన పండగలు గందరగోళంలో పడిపోతున్నాయి హిందువుల ఐక్యతకు ప్రతీకలుగా ఉన్న పండగలను ఎవరి ఇష్ట రీతిన వారు జరుపుతున్నారు ఒకే పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు జరుపుతున్నారు . హోలీ పండగ విషయంలోనూ అదే జరిగింది ఎంతో ఆనందోత్సవాల మధ్య అందరూ కలసికట్టుగా రోజంతా సంబరంగా హోలీ కేళి ఉంటది యువత రోడ్లపై చక్కర్లు కొడుతూ లొల్లి చేస్తారు కూలీనాలి చేసేవారు .

ఈనాం ల కోసం కలిసి కట్టుగా వెళ్లి పాటలు పడుతూ సందడి చేస్తారు కానీ ఈసారి హోలీ పండగలో ఇవేవి కనిపించలేదు  ఎందుకంటే అసలు పండగ ఎప్పుడు జరపాలనే విషయంలో స్పష్టత లేకపోవడమే ఒక్కోరు …..ఒక్కోరోజు …జరపాలని చెప్పడంవల్లే పండగ జోషే లేకుండా పోయింది చివరికి ప్రభుత్వంకూడా హోలీ సెలవు ఫై తికమక పెట్టింది పండగ ఎప్పుడో తెలియక  దేవాదాయశాఖకు  లేఖ రాసింది . కాని సెంట్రల్ గవర్నమెంటు ఒకటో తారీకు సెలవు ఇచ్చింది .

కానీ రాష్ట్రప్రభుత్వం రెండో తారీకు న సెలవు ఇచ్చింది . దీనితో రెండు రోజులు పండగ జరిగింది..ఎంతో  నిష్ఠనియమాలు భక్తి శ్రద్దలతో జరిపే శివరాత్రి విషయంలోనూ ఇదే జరిగింది . ఉగాది నుంచి జరిగిన ప్రధాన పండగలన్నీ ఇలాగే గందరగోళంగా జరిగాయి . అసలు పంచాంగం చూసే పంతుళ్ల మధ్య కనీస అవగాహన ఉండకపోవడంవల్లే ఇలాంటి తికమకలు చోటుచేసుకుంటున్నాయి . ప్రాశ్చత్య సంస్క్రతి వేగంగా దూసుకొస్తోంది అందువల్లే మన  సాంప్రదయాలు మసకబారుతున్నాయి. వాటి వైపు వెళ్ళ కుండా నేటి యువత మన ఆచారవ్యహారాలు పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత పంచాగంను బలంగా నమ్మే పంతుళ్ళమీదే ఉంది