2014 సాధారణ ఎన్నికల నుంచి అప్రతిహత విజయాలతో దేశరాజకీయాల్లోనే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి రావడ0 దుస్సాధ్యంగా మారుతుంది. ఇప్పటి దాకా చాలా రాష్ట్రాల్లో సులువుగా అధికారాన్ని కైవసం చేసుకున్న ఆపార్టీ మొన్న గుజరాత్ లో అధికారం నిలబెట్టుకోవడం కోసం ఎంతో శ్రమించింది చావు తప్పి కన్ను లొట్టా పోయిన చందంగా ఆ రాష్ట్రంలో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా మోడీ మానియా మసక బారుతున్న తరుణంలోనూ త్రిపుర లో కమ్యూనిస్ట్ ల కంచుకోటాలు బద్దలు కొట్టి బీజేపీ అధికారం కైవసం చేసుకుంది.

మళ్ళీ మోడీ కి తిరుగు లేదని ఆ పార్టీ నేతలు సంబర పడ్డారు . కానీ అంతలోనే యూపీ బీహార్ లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ కంచుకోటాలు బద్దలయ్యాయి. ఇంకేముంది మోడీ కామ్ హోగయా అంటూ సన్నాయి నొక్కులు వినిపించాయి. దీనికి తోడు మోడీ ని గద్దె దించడమే లక్ష్యంగా దేశంలోని ప్రధాన పార్టీలు ఒక్క తాటిపై వచ్చే పక్రియ మొదలయింది. ఎంతో నిబ్బరంగా కనిపించే మోడీ లో కొంత అలజడి మొదలయింది. ఇంట బయట ఒత్తిడి పెరిగింది. సరే ఇవన్నీ ఏ ప్రధానికైనా ఉండే సమస్యలే కానీ ఆయనకు సిసలైన సవాలు ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు ఉత్తరాదిలో మొదటినుంచి బలంగానే ఉంది కానీ ఈశాన్యము లో సత్తా చాటింది ఇప్పుడు ఇక మిగిలింది దక్షిణాది రెండు తెలుగు రాష్ట్రలలో ఎన్ని ఎత్తు గడలు వేసినా పార్టీ ఆశించినంతగా బలపడడం లేదు.

ఆపరేషన్ ఆకర్ష్ తుస్సుమంది. అయినా ఈ రాష్ట్రాల్లో ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. తమిళనాడు లో అడ్డుదారిలో వచ్చి ఎదో చేయబోయింది అది తుస్సే. అందుకే రజిని పెట్టె పార్టీ పైనే ఆశలు పెట్టుకుంది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారానే దక్షణాది లో బోణి కొట్టాలనేది బీజేపీ అగ్రనేతల ఆలోచన మోడీ పని తీరు ఫై విమర్శలు వెల్లు వెత్తుతున్న నేపథ్యములో వచ్చిన ఈ ఎన్నికల్లో విజయం అంత సులువేమీకాదు. సర్వశక్తులు ఒడ్డిన ఫలితం దక్కని పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి గాఉన్న సిద్దరామయ్య బీజేపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండ చేస్తున్నాడు.

అయన తెచ్చిన పథకాలు పాలనా తీరుపై ప్రజల్లో ఎ మాత్రం అసంతృప్తి లేదు. మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి సిద్దు ఒంటి చేత్తో కష్ట పడుతున్నారు. బీజేపీ పాచికలు పారకుండా ఎత్తుగడలు వేస్తున్నారు. అసలు అక్కడ ఎన్నికలు మోడీ vs సిద్దు గా మారిపోయాయి. మోడీ ప్రతిష్ట మసక బారుతున్న వేళా ఈ ఎన్నికల ఫలితాలు దేశంలోనే కొత్త సమీకరణలకు తెరతీయడం ఖాయం. కాంగ్రెస్ ఓడి పోతే ఆ పార్టీ మరో రాష్ట్రాన్ని కోల్పోతుంది కానీ బీజేపీ ఓడి పొతే మాత్రం వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ప్రతికూల పరిస్థితులను ఎదురుకోక తప్పదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టే మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అని ప్రముఖ సర్వే సంస్థలు చెపుతున్నాయి. ఈ పాటికే అమిత్ షా రంగంలోకి దిగారు బెంగళూరు సమీపంలో నే మకాం పెట్టారు. సర్వ శక్తులు ఒడ్డయినా సానుకూల ఫలితాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే మోడీ సభ లు మరికొన్ని పెట్టారు.