మీడియా  రంగంలో మూడు దశబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ‘ఈనాడు రామోజీ’ ఇప్పడు సోషియల్ మీడియాపై దృష్టి సారించారు ప్రింట్ , ఎలక్ట్రానిక్ , వెబ్ మీడియాలు చెలామణిలో ఉన్నాయి ఈ మూడు రంగాల్లోనూ రామోజీ దే గుత్తాధిపత్యం. కానీ ఇప్పుడు సోషియల్ మీడియానే సమాజంలో చాల ప్రభావాన్ని చూపుతుంది .ప్రింట్& TV’లు కానిపించని అంశాలు సోషియల్ మీడియాలో వచ్చేస్తూ వైరల్ అవుతున్నాయి . చాలామంది ప్రముఖులు ముఖ్యవిషయాలను ముందుగా ఈ వేదికల మీదే పంచుకుంటున్నారు . సభలు సమావేశాలు లైవ్ లో వచ్చేస్తున్నాయి . ప్రముఖుల ట్విట్టర్ లో పోస్టులను టీవీ లు ప్రసారం చేసుకుంటున్నాయి పత్రికలు వార్తలు వేస్తున్నాయి . ప్రధాన మీడియా ఉనికిని ప్రశ్నర్తకం చేస్తున్నాయి అందులో ప్రబుత్వాలనే తమ గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా చెలామణి అయిన వారికీ ఇది కంటిగింపు గానే ఉంటాది అందుకే సోషియల్ మీడియా విశ్వసనీయత ను దెబ్బతీసే పనిలో పడ్డారు .ఒకటి రెండు అసత్య కథనాలను ఫోకస్ చేస్తున్నారు మంత్రులు గంటా ,హరీష్ ల ఫై వచ్చిన కథనాల విషయంలో అబ్బో మన మీడియా చేసిన యాగీ అంతా ఇంత కాదు .వాళ్ళు అధికారంలో ఉన్నారు పోస్టు లు చేసిన వారిని పెట్టుకుంటరు కదా ….వీళ్ళకెందుకు నొప్పి ఈనాడు ఆదివారం మెయిన్ లో విషమే కక్కింది . అమెరికా లో ఓ సంస్థ సోషియల్ మీడియాలో 80 శాతం అసత్యాలేనని తేల్చి పారేసింది అయ్యా ….బాబు ఆదేశంలోప్రధాన పత్రికలు విశ్వసనీయత కోల్పోయినట్లు కూడా తేలింది . అందుకే ట్రంపూ మీడియాను వైట్ హౌజ్ వైపే రానివ్వడం లేదు ….పోనిలే ఆదేశం గొడవ ఎందుకు మీ పత్రికలో వస్తున్న కథనాల్ని అక్షర సత్యాలేనా ….ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి . మీ అక్షర సైన్యంలో అందరూ కడిగిన ముత్యాలేన సార్ ….. ముందు ఉన్నపలంగా రోజు మీ పత్రికలో అసత్య కథనాలు రాకుండా కట్టడి చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి …..ప్రభువుల పల్లకీలు మోయడంలో ఉన్న ద్యాస సామాన్యుల కష్టాలఫై లేదాయె మీ అక్షర సైన్యం రోజు జిల్లా మినీల లో తిమ్మిని బమ్మిని చేస్తూ పరువునష్టం దావాలుఎదుర్కుంటున్నారు . ముందు ఆవిషయం చుడండి సారు.