ప్రతీ ఏటా విద్యా రంగంపై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్తలతో పోటీ పడ లేక చతికిల పడి పోతుండడం తో బడులను కుదిసున్నది ప్రభుత్వ పంతుళ్ల వల్లే చాలా బడులు మూత పడిపోతున్నాయి కనీసం విద్యాబోధనలు లేక పోవడంవల్లే ప్రభుత్వ బడులకు విద్యార్థుల సంఖ్య బాగా తగ్గి పోతున్నది. విచ్చలవిడిగా పంతుళ్ల సంఘాలు ఏర్పడం తో చాల మంది టీచర్లు నాయకులుగా అవతారం ఎత్తారు. తాము పనిచేసే బడులకు వెళ్లకుండా దందాలు సాగిస్తన్నారు మరికొందరు ప్రైవేటు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీనితో చాలావరకు బడుల్లో మొక్కుబడిగా సిలబస్ పూర్తి చేసున్నారు. అందువల్లే ఫలితాలు నిరాశాజనకంగా ఉంటున్నాయి. తాము పనిచేసే చోట కనీస పాఠాలు చెప్పని ప్రైవేట్ పాఠశాలల కు తనిఖీల కోసం పంపుతున్నారు. తమ బడులను గాలికి వదిలేసి ప్రైవేటుబడులకు తనిఖీల పేరుతో వెళ్లి నీతులు వల్లిస్తున్నారు.

తామేదో ఉద్దరించి వస్తున్నట్లు పోజులు కొడుతున్నారు. కనీసం పుస్తకాల మొఖం కూడా చూడని కొందరుపంతుళ్లు ప్రైవేట్ లో పాఠాలు ఎలా చెప్పుతున్నారో టెస్టులు చేస్తున్నారు. ఇది వినడానికి చోద్యంగా ఉన్నా నిజమే ఏ పంతుళ్లు ప్రైవేట్ బడుల్లో చేస్తున్నా హంగామా లు అంతాఇంతా కాదు నానా యాగీ చేస్తున్నారు రూల్స్ అన్ని పాటించాలి అంటూ యజమాను లకు బోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా టెన్త్ విద్యార్థులకు20మార్కులు యాజమాన్యాలు ఇవ్వాల్సిఉంటిది కానీ ఈ మార్కులు కోసం కొన్ని నిబంధనలు పాటించాలిసి ఉంటది వీటిని క్రాస్ చెక్ చేయడానికి ఈ పంతుళ్ళను డీఈఓ పంపుతారు కానీ చాల వరకు పంతుళ్లు తాము పనిచేసేచోట కనీసం పాఠాలు చెప్పని వారే ఈ తనిఖీలకు వెళ్ళుతున్నారు రాష్ట్రం లో ప్రతి ఏటా ఈ తనిఖీ లు ఫిబ్రవరి చివరి వారంలో జరుగుతాయి. బడా పాఠశాలలో ఈ తనిఖీలు మొక్కుబడిగా జరుగుతాయి. యజమాన్యాలు యిచ్చే కవర్లు తీసుకోని అంతా బాగుందని వెళ్లిపోతున్నారు.