ఇద్దరు చంద్రులు ఒకేసారి ఢిల్లో డీ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. మోడీ తీరుతో రగిలి పోతున్న వీరు దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పి తమ సత్తా చాటాలనే ఉవ్విళ్ళు ఊరుతున్నారు. తమ రాష్ట్రాలను అభివృద్ధి పథం లోకి తీసుకెళ్లా లంటే కేంద్రం లో తామే అధికారంలో ఉండడం అనివార్యం అని గట్టి భావిస్తున్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు దేశ రాజకీయాలపై దృష్టి సారించారు……. గతంలో ఎన్టీఆర్ చూపిన బాటలోనే ఇద్దరు చంద్రుల ప్రయాణం సాగుతుంది లక్ష్యం ఒకటే ఐన విభిన్న పంథా వెళ్తున్నారు …సాధారణ ఎన్నకలు సమీపిస్తున్న తరుణంలో దేశంలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదికి రావడం మాములే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా చిన్నాచితకా పార్టీలన్నీ ఒకేవేదికమీదికి రావడం ఆతర్వాత విడిపోవడం రివాజే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఢిల్లీ లో కొత్త కూటమిలు తెరమీదికి రావడంలో తెలుగు నేతలే కీలకంగా ఉంటున్నారు. వీపీ సింగ్ కలిసి టీడీపీ అధినేత ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసారు. ప్రాంతీయ పార్టీలను ఒక్కవేదికమీదికి తేవడంలో ఎన్టీఆర్ సక్సస్ ఆయన చెప్పిందే వేదం అయింది. వీపీసింగ్ ప్రధానమంత్రి కావడంలో ఎన్టీఆర్ దే కీలక పాత్ర కానీ ఆ ప్రభుత్వం ఎక్కవ కాలం ఉండ లేక పోయింది.

ఆతర్వాత టీడీపీ అధినేతైనా చంద్రబాబు సైతం అదే ఒరవడి కొనసాగించారు. యునైటెడ్ ప్ర0ట్ తో కొత్త సంకీర్ణప్రభుత్వం ఏర్పాటులో బాబు కీలకంగానే ఉన్నారు అదీగాక దేవే గౌడ ప్రధాని కావడంలోనూ చక్రం తిప్పారు. వాజపేయి మోడీ లకు మద్దత్తు ఇచ్చారు. ఉద్యమ కాలంలో తెరాస యూపీఏ సర్కార్ లో చేరింది . కానీ ఆ తర్వాత వైదొలిగింది. ఎన్ డీ ఏ లో ఉన్నపుడు టీడీపీ కానీ యూపీఏ ఉన్నప్పుడు తెరాస కానీ అనుకున్న కార్యాలు సాధించలేక బయటకు వచ్చేసాయి. ఇలాంటి అనుభవాల దృశ్యనే ఇద్దరు చంద్రులూ మూడో ప్ర౦ట్ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అందుకే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన వీరు మోడీ నేరుగా ఢీ కొడుతున్నారు.హోదా పేరుతో ఏపీ సీఎం రిజర్వేషన్ల వంక తో తెలంగాణ సీఎం లు మోడీ ఈపాటికే ఏకి పారేస్తున్నారు. అసలు రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మితిమీరి పోయిందని దేశంలో సమూల మార్పులు అనివార్యమని బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలతో ప్రజలు విసిగి పోయారని కెసిఆర్ చెపుతున్న ఫై చర్చ జరుగుతుంది.మోడీ ని విబేదించడంపై బయటకు పొక్కని కారణాలు ఏమున్నా . తాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని బలంగానే చెప్పుతున్నారు.

సహజంగానే ప్రజల నుంచి వారి పోరాటానికి సానుకూలత వ్యక్తం అవుతుంది సరే వీరు ఇందుకోసం ఢిల్లీ బాట పట్టారనేది పక్కన పెడుదాం అసలు వీరు అక్కడ ఈమేరకు సక్సెస్ అవుతారనేదే అందరికి ఆసక్తి గా మారింది.ఫెడరల్ ఫ్రంట్ ఫై మొదట ప్రకటన చేసిన తెరాస అధినేత కెసిఆర్ తొలి అడుగు సోమవారమే వేశారు దేశంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లి రాజకీయపక్షాలనే కాకుండా వ్యాపారులను మాజీ సైనిక అధికారులను మాజీ ఐఏఎస్ లతో సమావేశం కానున్నట్టు ముందే చెప్పారు అందులో భాగంగానే కోలకతా వెళ్లి మమతా ను కలిసారు. రాబోయ్ రోజుల్లో ఇలాంటి పర్యటనలను మరిన్ని చేయబోతున్నారు . తద్వారా ఫెడరల్ ఫ్రంట్ కు ఒక స్పష్టమైన రూపం ఇవ్వాలని కెసిఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో మరింత అబివృద్ది జరగాలంటే తాము కేంద్రం కీలకం ఉండడం ఇపుడు కెసిఆర్ అనివార్యంగా భావిస్తున్నారు .ఇక మరో చండ్రుడు ఏపీ సీఎం అయితే మోడీ తీరుతో రగిలి పోతున్నారు. ఎన్ డ్ ఏ నుంచి బయటికి వచ్చిన బాబు ఇప్పుడు భవిష్యత్తు వ్యహా రచన లోఉన్నారు. కొత్త రాష్ట్రంలో తాను అనుకున్న తీరునా అభివృద్ధి చేయలేక పోతున్నారు మోడీ తనను పక్కన పెట్టేయడమే బాబు కు మింగుడి పడని విషయం .

అందుకే అయన తన దారి చూసుకుంటున్నాడు . అసలు గతంలో మాదిరి ఢిల్లీలో తానే చక్రం తిప్పడం పైనే బాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలాగో లోకేష్ రాష్ట్రాన్ని హ్యాండిల్ చేస్తాడనే ధీమాతో ఉన్న బాబు ఇప్పుడు మోడీ నిగద్దె దించాలనే కసితో ఉన్నట్లు సమాచారం. మోడీ కి వ్యతిరేకంగా ముందుకు వచ్చే వారందరిని కలుపుకొని వెళ్లనే ఆలోచనలో ఉన్నారు. చూద్దాం ఇద్దరు చంద్రుల ఢిల్లీ మజిలీ ఏ మేరకు సఫలీకృతం అవుతుందో …..