రాబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తెరాసలో కసరత్తు ఈపాటికే పూర్తిఅయింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధినేత కెసిఆర్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఎడతెగని కసరత్తు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా సామజిక సమీకరణాలు కోణంలోనే అభ్యర్థుల పేర్లు పరిశీలన జరిగింది. ఓసి.బీసీ.మైనారిటీ ఫార్ములాతెరమీదికి తెచ్చినట్లు సమాచారం ఈసారి మూడు స్థానాలు దక్కనున్నాయి ఈపాటికే ముగ్గరు ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు చాలామంది ముఖ్యనేతలు రాజ్యసభ స్థానంకోసం ఆశలు పెట్టుకొనిఉన్నారు ప్రధానంగా పార్టీలో మొదటినుంచి ఉన్నవారి జాబితా చాలానేఉన్నది కొందరు ఈపాటికేకెసిఆర్ ను కలిసి తామమనోగతాన్ని చెప్పారు అన్నిలెక్కలు వేసుకొని సామాజిక సమతుల్యం పాటించే ఫార్ములాను ఖరారు చేసారని పార్టీవర్గాలు చెప్తున్నాయి.

ఓసిల నుంచి టీ న్యూస్ ఎండీ సంతోష్కు అవకాశం దక్కనున్నది తనసామజిక వర్గానికే చెందినప్పటికీ సంతోష్ ఉద్యమకాలంనుంచే కెసిఆర్ కు వెన్నంటి ఉన్నారు కష్టకాలంలోనూ అండగాఉన్నారు పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనే అత్యంతకీలకంగా మారారు సంతోష్ విషయంలో సీనియర్స్ నుంచికూడా సమ్మతిఉంది. కానీ బీసీ కోట విషయంలోనే కిరికిరి ఉంది. కానీ ముదిరాజ్ సామజిక వర్గంనుంచి ఒకరిని రాజ్యసభకు పంపుతానని ఇటీవలే మాటిచ్చారు దీనితో బీసీ కోటాలో ముదిరాజ్ ల నుంచి ఒకరికి ఛాన్స్ రావడం ఖాయం అదికూడా హైదరాబాద్ వారికే అవకాశం ఉంటుంది.

ఇక మైనారిటీ కోట ఖచ్చితంగా ముస్లిం లకే ఛాన్స్ ఉంటది రాబోయే ఎన్నికల్లో ముస్లిం ఓట్లు కీలకం కానున్నాయి ఎలాగో రిజర్వేషన్ల పక్రియ ఆలస్యం అవుతుండడం తో అధికారపార్టీలో ఆందోళన వ్యక్తం అవుతున్నది ఎట్టి పరిస్థిల్లో చట్టం తెస్తామని కెసిఆర్ ఈపాటికే స్పష్టం చేసారు అయినప్పటికీ కీలకమైన ఎంపీ స్థానం ముస్లిం వర్గానికి ఇవ్వాలని కెసిఆర్ పట్టుదలతో ఉన్నారట కానీ అరడజను మంది లైన్లోఉన్నారు. కవిత ప్రాతినిధ్యం వహిస్తన్న నిజామాబాదు జిల్లా నుంచి రహీమ్ సోఫీకి ఛాన్స్ ఇవ్వాలని జిల్లాకు చెందిన మ్మెల్యే మ్మెల్సీ లు కెసిఆర్ ను కోరినట్లు సమాచారం మరోవైపు ఎంఐఎం నుంచికూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.