మందకృష్ణ ,కోదండరాంలు ఏ కార్యం తలపెట్టిన పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. వారు ఏమి చేసిన రచ్చ అవుతుంది . వారి ప్రాబల్యాన్ని తగ్గించే ఏకార్యమైన వికటిస్తూనేఉంది. ముఖ్యంగా జాక్ (JAC) నేత కోదండరాం విషయంలో పోలిసుల చర్యలు ఫలించడం లేదు. గతంలో నక్సలైట్ల సభలను సైతం పోలీసులు ఇదే తరహాలో అడ్దకునే వారు వాటితోనే వారు ప్రజల్లో తొందరగా బలపడ్డారు. ఇప్పుడు కోదండరాం విషయంలో ను అదే జరుగుతుంది. ఏ ఆందోళనకు వెళ్లినా పోలీసులు వెళ్లి రచ్చ చేస్తున్నారు. అదే జాక్ (JAC) కు కలిసివస్తుంది.

శనివారం మిలియనీయం మార్చ్ జగకుండా పోలీసు అడ్డుకున్నారు. ట్యాంక్ బాండు రోడ్డునే మూసేసారు . రాజధానికి వెళ్లే అన్ని దారులను పోలీసులు దిగ్బందించారు. ఆయన్ని బొలారం టౌన్ లో పడేసారు. కానీ అనుమతి ఇచ్చిన ఇంత పబ్లిసిటీ వచ్చేదికాదు. పోలీసుల చర్యలే కోదండరాం ను ప్రజల్లో బలపడేలా చేస్తున్నాయి. ఈ తరహాలోనే ఆయన ప్రాబల్యం పెంచుకుంటున్నారు. కానీ తమ పల్లకిలుమోసే వారినే అందలం ఎక్కిస్తారు నెత్తినపెట్టుకొని ఊరేగుతారు. అలాగే నచ్చనివారిని ఎంత కఠినంగానైనా శిక్షించడానికైనా వెనుకాడరు.

తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జాక్ (JAC)నేత ప్రొపెసర్ కోదండరాం విషయంలో ప్రభుత్యం అత్యంత కఠిన వైఖరితో ఉంటుంది. అన్ని పార్టీలు,ఉద్యమసంఘాలు ప్రతిరోజూ ఎదో ఒక ఆందోళనలు చేస్తూనే ఉంటాయి పరిస్థితి చేయి దాటిపోతుంటేనే పోలీసులు రంగంలోకి దిగుతారు. లేకపోతె అసలు అనుమతే ఇవ్వరు. కానీ కోదండరాం చేసే ఆందోళనల విషయంలోనే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.

అదే ఆచార్యునికి కలిసివస్తుంది. ఉద్యమకాలంలో తెరాసఅధినేత కెసిఆర్ వెంటే ఉన్నారు. కానీ అప్పుడు కెసిఆర్ ను ఆడిపోసుకొని ఉద్యమానికే ద్రోహం తలపెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు కానీ తెరాస అధికారంలోకి వచ్చాక సీను రివర్సు అయింది. కోదండరాం విరోధిగా మారిపోగావిరోధిలు ప్రభుత్వంలో ఇప్పుడు కీలకంగా మారారు. అయన రాజకీయపార్టీ పెట్టె సన్నాహాల్లో ఉన్నారు. కోర్టు అనుమతితో గతంలో జాక్ పెట్టిన సభ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ జాక్(JAC) చేపట్టే ఆందోళనల విషయంలోనే పోలీసులు ఉలిక్కి పడుతున్నారు దగ్గరుండి కోదండరాం బలమును పెంచుతున్నారు.