హోదా ఫై  కేంద్రం చేతులు ఎత్తేయడం తో తీవ్ర ఒత్తిడి లో ఉన్న ఏపీ సీఎం బాబు ఫై జనసేనాని సంధించిన అస్ర్తాలతో ఉక్కిరిబిక్కిరి కానున్నారు . అసలు మొన్నటి దాకా ప్రధానిమోడీ నే లక్ష్యంచేసుకొన్న పవన్ కళ్యాణ్ గుంటూరులో జనసేన పార్టీ నాలుగేళ్ళ సభ ఏపీ సీఎం బాబు అయన తనయుడు లోకేష్ ఫై నిప్పులు చెరిగారు. బాబు విషయంలో పవన్ మొదటినుంచి సానుకూల వైఖరితో ఉంటూవస్తున్నారు సుతిమెత్తగా చురకలు వేసేవారు కానీ ఎక్కడ తేడాలొచ్చాయా కానీ సహజధోరణికి బిన్నంగా చాల కూలుగా నిలకడగా కొంత పరిణితి చెంది మాట్లాడాడు గుంటూరు సభా ఏపీ లో కొత్త రాజకీయ సమీకరణలకు తెర లేపనుంది .

అకస్మాత్తుగా పవన్ బాబు ఎందుకు టార్గట్ చేసినట్టు ? అసలే మోడీ సహకరించడం లేదంటూ మంత్రులతో రాజీనామా చేయించాడు అసలు తదుపరి కార్యాచరణ ఏమిటో తెలియక సందిగ్ధం లో ఉన్న బాబు ను పవన్ మరింత ఇరుకున పడేసారు …2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ ల గెలుపు కోసం అహో రాత్రులు శ్రమించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగేళ్లు పార్టీ నిర్మాణం చేతులో ఉన్న సినిమాలు పూర్తీ చేయడంపైనే దృష్టి పెట్టారు. కానీ మిత్ర ధర్మము పాటించారు ఏపీ సీఎం బాబు ఫై నేరుగా దుమ్మెత్తి పోయలేదు కానీ హోదా విషయంలోనే కొన్నిసార్ల కఠినంగా మాట్లాడారు .

మరి ఒక్కసారిగా ఏమొచ్చిందో కానీ ఈ సభలో తీవ్రమైన వ్యాఖ్యలే చేసారు …..

1)ఐటీ దాడుల్లో దొరికిపోయిన టీడీపీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి కేసులో లోకేష్ పేరు వినిపించింది. లోకేష్ ను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లివచ్చారు. ప్రధాని మోదీకి చంద్రబాబు భయపడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

2) ఇసుక మాఫియా మొదలు కనకదుర్గమ్మ గుడి వద్ద పార్కింగ్‌ వరకు అన్నింటిలోనూ టీడీపీ నేతల దోపిడీ కొనసాగుతోంది.

3)పవన్‌ కూడా అండగా ఉండరు.. 2019 ఎన్నికల్లో జగన్‌ను ఎదుర్కొనేందుకు అవినీతికి పాల్పడుతున్నామని టీడీపీ నేతలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

4) ఎన్నికల కోసం ప్రతి నియోజకవర్గానికి రూ. 25 కోట్లు అప్పుడే సిద్ధం చేసి పెట్టామని తెలుగుదేశం పార్టీ నేతలు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు. ఇంకా ఎంత తింటారు? లోకేష్ అవినీతికి అవధులే లేకుండా పోయాయి అంటూ పవన్‌ కల్యాణ్‌ విరుచుకపడ్డారు ఎందుకు భావోద్వేగం గుంటూరులో కలరా తో జనం చనిపోతే బాధ లేదా ?చిన్నపిల్లలు చనిపోతే దుఃఖం రాదా ?అంటూ చురుకలు అంటించారు .

సుమారు రెండు గంటలు ఏపీ లో నెలకొన్న పరిస్థితులపై నే ఏకరువు పెట్టారు .పనిలో పనిగా రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు చెప్పారు . మోడీ ఫై పేలుతుందనుకున్న పవన్ తుపాకీ బాబు అయన చినబాబు ఫై డాం అని పేలి పోయింది ………