“నేను అడా ఉంటా ….ఈడ ఉంటా”– అంటూ రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ పలికే డైలాగు పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజజీవితంలో లోనూ ఆచరించేపని పనిలో పడ్డారు. భారీ డిజాస్టర్ తో సినిమా ప్రస్థానం ముగించి ఇప్పుడు రాజకీయాల బాట పట్టారు. ప్రజారాజ్యంపార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక రాజకీయాలపై కసి పెంచుకున్న పవన్ అన్న చిరంజీవి నచ్చజెప్పినా వినకుండా కొత్త పార్టీ కి సన్నాహాలు చేసారు కానీ అప్పుడే ఆంద్రప్రదేశ్ రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి . ఉవ్వెత్తున లేచిన ఉద్యమము తో కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది . కానీ పవన్ అప్పుడు తలెత్తిన పరిణామాలపై నోరెత్తలేదు. కానీ కొద్దీ రోజులకే హైదరాబాద్ నోవటల్ హోటల్ వేదికపై నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించారు.

ఇక్కడ ఓ విషయం చెప్పాలి తెలంగాణ యాసలో కెసిఆర్ ,కవిత ,కేటీఆర్ ఫై తీవ్రస్థాయిలో విరుచుక పడ్డారు. తెలంగాణ జాగృతి పేరుతొ భారీగా వసూళ్లు చేసారని ఆరోపించారు . మరోవైపు ఆంధ్రప్రదశ్ లోని వివిధ ప్రాంతాల్లో వెళ్లి విభజనపై నోరువిప్పారు. అప్పుడు తాను చాలా చింతించనని కొన్ని రోజులు అన్నం కూడా తినలేదని ఏకరువు పెట్టుకున్నారు. ఈలోపు ఎన్నికలొచ్చాయి జనసేనాని పోటీకి ఆసక్తి చూపలేదు కానీ టీడీపీ బీజేపీల పక్షనా ప్రచారానికి దిగాడు అక్కడికి వెళ్లి విభజన ఫై రగిలిపోయాడు . ఏపీ తీరని వ్యధ కలిగించారని ఇటువైపు వచ్చి కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకొని మోడీ కి దన్నుగా నిలిచాడు. ఆంధ్రప్రదశ్ లో బలమైన కాపు సామజికం పవన్ రాకతో అనివార్యంగా టీడీపీ వైపు వెళ్లారు చివరిలో జగన్ కు అదే నష్టం కలిగించింది .

దేశంలో బీజేపీ ఆంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి . ఓహో ఇక పవన్ కు ఎదురేలేకుండ పోయింది కానీ తెలంగాణలో అయ్యగారు ప్రభావం కనిపించలేదు .ప్చ్ …..ఇక్కడ తన చరిష్మా పనిచేయలేదని చింతించాడు కానీ ఏపీ లో మాత్రం రాజకీయంగా బలపడే యత్నాలు చేసాడు కేంద్రంపై , ఎంపీ ఫై విరుచుకపడుతూ వచ్చాడు కానీ బాబుపై ఈగ వాలకుండా చూసుకుంటూ వచ్చాడు. అదే టైమ్ లో కెసిఆర్ ప్రభుత్వంపై కనీసం నోరెత్తలేదు కానీ ఆంధ్రలో ఉద్దీపం . పోలవరం లాంటి అంశాలు , రాజధానికోసం భూములు కోల్పోయిన రైతులు వైపు గట్టిగానే స్పందించాడు .

ప్యాకేజి వద్దు హోదా కోసమే ఎంపీ లు పోరాటం చేయాలనీ పిలుపునిచ్చాడు .ప్యాకేజీ ని పాచిన లడ్డుతో పోల్చాడు. కానీ బాబు తో పూర్తిగా చేతులు కాలిపడనే విమర్శలు వచ్చాయి దీనితో జనసేనాని ఏపీ కె పరిమితం అనుకున్నారు . సరిగ్గా నాలుగేళ్లకు సార్ చూపు ఇక్కడా పడింది అర్జెంట్ గా బయలుదేరి కొండగట్టు వెళ్ళాడు మరుసటి రోజే కరీంనగర్ అయిదు జిల్లాల అభిమానులతో సమావేశం పెట్టి కెసిఆర్ ను అదేపనిగా మెచ్చుకొనిపనిలోపనిగా తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టమని రక్తంకూడా ఇస్తానంటు వీరావేశంతో అన్నాడు . కానీ మరుసటి రోజే అనంతపూర్ వెళ్లి డిట్టో అదే స్టేటుమెంట్ ఇచ్చాడు . తెలంగాణలో బలం ఉన్న చోట పోటీ చేస్తామని పార్టీ ని బలోపేతం చేయబోతున్నట్లు గర్జించాడు ఇంకేముంది .

ఈలలు చప్పట్లు ఆతర్వాత హైదరాబాద్ లో పార్టీ ఆఫిస్ మొదలు పెట్టారు ఒక్కో జిల్లా నుంచి కొంత మంది యువత ను పిలిచారు ఎప్పటిలాగే హడావుడి ఆ తర్వాత అంతా ష్ …గపు చుప్ కానీ ఏపీ రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టారు అందుకే నాల్గో పార్టీ ప్లినరీ గుంటూరు భారీగా జరుపుతున్నాడు. అంతేకాదు అక్కడే ఆఫీస్ ఓ భారీ ఇల్లు ఏకకాలంలో నిర్మిస్తున్నాడు. సభకు భారీ జనసమీకరణ చేస్తున్నారు మరోవైపు ప్రజా క్షేత్రంలోకి వస్తున్నా తనకు రక్షణ కల్పించాలని తనపై దాడి జరిగే ప్రమాదం ఉందని డీజీపీ కి ఓలేఖ రాశాడు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ కొత్త టిస్ట్ ఇచ్చారు. పవన్ తన భద్రత కోసం ఏపీ పోలీసులనే ఆశ్రయించాడు దీనితో అయన ఏపీ కె ఫుల్ టైమ్ ఇస్తాడు అనితేలి పోయింది . కానీ హైదరాబాద్ లో నూ ఆఫీస్ ఆపై జిల్లాల కమిటీలు ఏర్పాటు అవుతుండం వల్లే సార్ అడా ఉంటాడు ..ఈడ ఉంటాడు అని జన సైనికులు సంబర పడుతున్నారు .