తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరోగా వెలుగుగొందుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనువిందు చేయడం కుదరకపోవచ్చు. ఎన్నో ఆశలు అంచనాలు మధ్య వచ్చిన ఆజ్ఞతవాసి తీవ్ర నిరాశ పరిచింది అంతకుముందే సక్సెస్ లేకపోవడంతో అభిమానులు డీలా పడిపోయారు. సూపర్ హిట్ తో సినీ ప్రస్థానం తాత్కాలికంగా ముగించి రాజకీయాల్లోకి వెళ్లాలనేది పవన్ ఆలోచనగావుండే. కానీ అది సాధ్యం కాలేదు ఇప్పుడు చేతులో ఉన్న మరో సినిమా ను పూర్తి చేసేఅలోచనతో ఉన్నాడట. సాధారణ ఎన్నికలు మరో ఏడాది లో ఉండడంతో పవన్ దృష్టి ఇప్పడు పూర్తిగా రాజకీయాల ఉంది .

తాను ఎన్నో ఆశలతో స్థాపించిన జనసేన పార్టీని ప్రజలోకి తీసికెళ్లాలని భావిస్తున్నారు. గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్జ్యం పార్టీ కాంగ్రేస్ లో విలీనం చేయడంపై తీవ్రంగా కలతచెందిన పవన్ కొంతకాలం ఓపిక పట్టి అన్నా ను కాదని మరి జనసేన పెట్టారు.కాని చాల కాలంపాటు ఆపార్టీ నిర్మాణంపై కనీస దృష్టి పెట్టలేకపోయారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమి కోసం విస్తృతంగా ప్రచారం చేసారు. కాని ఎన్నికల తర్వాత పవన్ సినిమాలకే పరిమితం అయ్యారు.

ఏపీ లో కొన్ని సమస్యలపై గొంతెత్తారు. రెండేళ్ల నుంచి మళ్ళీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. నిజానికి సినిమాలను తగ్గించారు ఈలోపు ఏపిలో హోదా ఉద్యమాలు తెరమీదికి రావడంతో పవన్ మళ్ళీ యాక్టీవ్ అయ్యారు. తెంగాణాలోనుపార్టీ బలోపేతం చేస్తానంటూ కొండగట్టు లో ప్రకటించారు కెసిఆర్ పనితీరుకు కితాబు ఇచ్చేసారు మూడు జిల్లాలో పర్యటించారు. జిల్లావారీగా పార్టీకోసం పనిచేసేవారిని ఎంపిక చేసేపనిలో ఉన్నారు.హైదరాబాద్ లో ఆపీస్ పెట్టారు. ఈలోపు ఒకటిరెండు సినిమాలు చేసి ఫుల్ టైమ్ రాజకీయాలు చేసుకోవాలని చూసారు .కానీ ఇపుడు ఆపరిస్థితి లేదు.

ఏపీ లో హోదా హోరు తో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి . ఉన్నపళంగా రంగంలోకి దిగడం పవన్ కు అనివార్యం అయింది. అందుకే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుచేసారు జెపి ఉండవల్లి లతో కలిసి పనిచేస్తున్నారు. మరోవైపు పార్టీ ని సంస్థాగతంగా పటిష్టం చేసే పనిలోపడ్డారు. గుంటూరు లో మొదటి ప్లినరీ ని భారీఎత్తున చేస్తున్నారు ఇక పవన్ ఇంతట్లో సినిమాలవైపు వచ్చే పరిస్థితి లేదు. 2019ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తున్న పవన్ కొంతకాలం ప్రజాక్షేత్రంలోనే ఉండే అవకాశం ఉంది.