తమిళనాట సూపర్ స్టార్ గా ఉన్న రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు సహచర నటుడు కమలహాసన్ ఈపాటికే ఓపార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు . కాని కమల్ కన్నా ముందే సన్నాహా మొదలు పెట్టిన రజిని తాను నటిస్తున్న రెండు సినిమాలు పూర్తిఅయ్యాక రాజకీయాల్లోకి రావాలనుకున్నారు . కాని కమల్ రాకతో రజిని ఫై సహజంగానే ఒత్తిడి పెరిగింది సొంతపార్టీ తో రాజకీయాలోకి రావాలనేది  ఆయన ఆలోచనగా ఉంది . అందుకే చివరి రెండు సినిమాలు భారీ విజయం సాధించాలని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు . ఆ ఊపులోనే ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది. ఏం జి ఆర్ ,కరుణానిధి ,జయలలిత సినీజీవితం నుంచి వెళ్లి సక్సస్ అయ్యారు కాని విజయకాంత్ ఫెయిల్ అయ్యారు . సాధారణ ఎన్నికలకు ముందు రజిని పేరు తెరమీదికి వచ్చింది కాని ఆయన ఆసక్తి చూపలేదు .

ఎట్టకేలకు ఈసారి అడుగు ముందుకువేసారు . చివరి రెండు సినిమాలు భారీ అంచనాలు పెంచాయి తన కొత్తపార్టీ కి ఈ సినిమాలు దోహదం చేయాలని రజిని బావించవచ్చు . సుమారు నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని నటుడుగా ఎదిగారు . ఆ ఇమేజ్ తోనే రాజకీయాల్లో రాణిస్తారని అందరు అంచనా వేస్తున్నారు . అయితే చివరి సినిమాలుగా భావిస్తున్న రోబో 2.0 ,కాల ఫై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు రోబో 2.0 నిర్మాణంలో జాప్యం అవుతుంది అందుకే కాలను తెరకెక్కిస్తున్నారు నిజానికి ఈ సినిమానే ముందు రిలీజు అవుతుంది . రజనికి బాగా కలిసోచ్చే మాఫియా నేపథ్యము తో నే  కాల ఉండబోతుంది బాషా ,బాస్ ,కబాలి సినిమాలు సక్సెస్ అయ్యాయి . అందుకే  కాల  కూడా రజిని కి కలిసివస్తుందట  నిన్నే టిజర్ రిలీజ్ చేసారు యూ ట్యూబ్ ను ఊపేస్తోంది . ఈసినిమా విడుదల తరువాతే రాజకీయంగా మరోఅడుగు ముందుకువేసే అవకాశం ఉంటుంది .