పద్మభూషణ్ రామోజీ కూడా మోడీ తో తెగ తెంపులు చేసుకున్నట్లేనా? దశాబ్లాల వారి స్నేహానికి బీటలు వారినట్లేనా ?ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేరోజు మొదటి వరుసలో సీటు దక్కించుకొని . ఆరోజు ఏపీ సీఎం బాబు ఎక్కడో మూడో వరుసలో ఉన్నాడు కదా ! అందుకే రామోజీ గ్రేట్ అన్నారు. ఆతర్వాత కూడా ప్రధాని మోడీ తో సత్సంబంధాలు కొనసాగాయి. ఏపీ కొత్త రాజధానికి ఏ పేరు పెట్టాలని తర్జన భర్జన పడుతున్న టైంలో చంద్రబాబు కన్నా ముందే రామోజీ చెప్పినట్లు గానే అమరావతి పేరును ఖరారు చేసారు . ఈవిషయం చాలా రోజుల ముందుగానే రామోజీ ఈనాడు ఉద్యోగుల సమీక్షాసమావేశాల్లో చెప్పారట. మోడీని బాబుకన్నా సులువుగా రామోజీ కలిసేదట. వారి బలమైన బంధానికి తీపిగుర్తుగానే భారతప్రభుత్వం ఆయన్ని ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు తో సత్కరించింది .

నాలుగేళ్లుగా అలిసిపోకుండా మోడీ పల్లకి మోసిన ఈనాడు ఇక తెగ తెంపులు చేసుకుంది బాబు తోపాటు ఈనాడు కేంద్రంలోని మోడీ సర్కార్ ఫై సమరభేరి మోగించిందా ?ఎస్ ….ఈమధ్య ఆపత్రిక ప్రధాన సంచిక చుస్తే అర్థం అవుతుంది . ఆ రాష్ట్రప్రజల పక్షాన కాకుండా బాబు వెళ్లే బాటలోనే ఈనాడు వెళ్తుంది. ఇదేం వైపరీత్యం..మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే గిట్టని ఈనాడు లో ఈమధ్య ఆపార్టీ కి ప్రాధాన్యత అనూహ్యంగా పెరిగిపోయిందిబీజేప, మోడీ లే లక్ష్యంగా చేసుకుంది. అసలు 2014 సాధరణ ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు కావడంలో వెంకయ్య తోపాటు రామోజీ లే కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరిగింది . ఎందుకంటే రామోజీకి బీజేపీ కురువృద్ధుడు అద్వానీ తో మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి . అయన శిష్యబృందంలో ఒకరైన మోడీ తో సహజంగానే దోస్తానా కుదిరింది.

ఈటీవీ గుజరాత్ మొదటి నుంచీ అక్కడ సీఎం గా ఉన్న మోడీ భాజనే చేస్తూవచ్చింది.  బీజేపీ ప్రధానమంత్రి అబ్యర్థిగా మోడీ ని గత ఎన్నకల్లో అదేపనిగా బాకా ఊదాడు . మోడీ ఎన్నికల సభలను విస్తృతంగా కవరేజి ఇచ్చాడు. బాబు ,మోడీ లను తన భుజాలపై మోశాడు. అధికారంలో కి వచ్చాక దేశంలో ఏ మీడియా అధిపతికి ఇవ్వని ప్రాధాన్యత రామోజీ కి ఇచ్చారు. కానీ ఇవన్నీ పక్కన పడేసిన రామోజీ తన బద్దశత్రువు కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇస్తూ మరోవైపు మోడీ టార్గట్ చేసాడు. ఏపీ లో బీజేపీ ప్రతిష్ట ను మసక బార్చే కార్యాన్ని రామోజీ తన నెత్తిన వేసుకున్నాడు .

టీడీపీ స్నేహం చెదిరిపోయింది కదా ఏపీ పార్టీ బలోపేతం చేయడంపై షా ఏపీ బీజేపీ నేతలతో ఢిల్లీలో శనివారం ఓ సమావేశం పెట్టారు. కానీ ఈనాడుకు ఇది ఎంత మాత్రమూ నచ్చలేదు అందుకే వ్యంగంగా రాసింది. జగన్ ఫై ఉన్న కేసులన్నీ క్లోజు చేసే కుట్ర జరుగుతుందని ఆవిషయంలో మన నిప్పు బాబు తీవ్ర వేదన చెందుతున్నారని ఈనాడు ఓవార్తను వేసింది. ఆదివారం మెయిన్ పేజీ మొత్తం మోడీనే టార్గట్ చేసింది .అలాగే హోదా తాలూకు మచ్చ బాబు ఫై పడకుండా ఈనాడు ఏపీ ఎడిషన్ సర్కస్ ఫీట్లే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ని బద్దశత్రువు భావించేరామోజీ వై ఎస్ చనిపోయాక ఆపార్టీ ఢిల్లీ పెద్దలు వచ్చి కలిసాక కొంత వైఖరి మార్చుకున్నాడు.  అందుకే మోడీ తో సంబంధాలు బెడిసిపోయాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీసేపనిలో ఉన్నాడు మన పద్మభూషణ్ రామోజీ …..: