ఎంపీ లు పార్లమెంట్లో లొల్లీ చేసారు ….చివరికి టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేసారు ….మోడీలైన్ లోకి వచ్చారు. అయినా కేంద్రం నుంచి ఇసెత్తు స్పందన లేదు. రాజీనామాలు ఇవ్వడానికి వెళ్లిన మంత్రులతోనూ మోడీ ముక్తసరిగానే మాట్లాడటా. హోదా విషయంలో కేంద్రము ఇక దిగివచ్చేట్లు లేదు. మొత్తానికి రెండు రోజుల సుదీర్ఘ కసరత్తు ను ఆపార్టీ అధినేత ఓ కొలిక్కితెచారు. ఏపీ లో కూడా బీజేపీ మంత్రులు గురువారమే రాజీనామాలు చేసారు. దీనితో ఓఘట్టం పూర్తయింది. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని హోరెత్తించిన ప్రధాన పార్టీలు తదుపరి కార్యాచరణ ఫై మల్లగుల్లాలు పడుతున్నాయి.

రాజీనామాలతో హోదా తాలూకు ఒత్తిడి నుంచి టీడీపీ కొంత బయట పడింది.హోదా పేరు తో ప్రజల్లో మరింత చొచ్చుకెళ్లాలని భావించిన ప్రతిపక్షాలు ఇపుడు ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనే యోచిస్తున్నాయి.హోదా సాధించే విషయంలో టీడీపీ కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆచి తూచి అడుగు వేసినా నెక్స్ట్ ఎం చేయాలనే దానిపైఅన్ని పార్టీలతో పాటు టీడీపీ అయోమయంలోనే ఉంది.

మొన్నటి దాక ఆందోళనలను ఢిల్లీదాకా తీసుకెళ్లి టీడీపీ బీజేపీ లపై ఎంతో ఒత్తిడి పెంచినా ఫలితం లేదు. అసలు కేంద్రం హోదానే ఇచ్చేది లేదు ఎదో ఫ్యాకేజిచెప్పిన మేరకు ఇష్టం.హోదా ఏరాష్ట్రానికి లేదు.అసలు సెంటిమెంట్ ఆదారంగా నిర్ణయాలు ఉండవ్ అంటూ కేంద్రము తెగేసి చెప్పింది.హోదా తాలూకు వివరాలను కేంద్రము స్పష్టంగా చెప్పేసింది.అయినా అదే డిమాండ్ తో ఉద్యమాలు ముందుకు ఎలా తీసుకెళ్తామని ఏపీ నేతలు అంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో నుంచి వెళ్లిపోతున్నా మోడీ లైట్ తీసుకున్నాడట.ఇప్పటి దాక హోదా ఉద్యమాన్ని ఎలాగో నెట్టుకొచ్చిన నేతలు ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలో తెలయడంలేదు.