కాంగ్రెస్ పార్టీ ని లక్ష్యంగా చేసుకొనే కెసిఆర్ మోడోకూటమి ని తెరమీదికి తెచ్చారా ? బీజేపీ కి అనుకూలంగానే ఇదంతా చేస్తున్నాడా? అందుకే దేశంలో కాంగ్రెస్ తో కలిసిఉన్న పార్టీలనే సంప్రదించాడా ?వారు యూపీఏ నుంచి బయటకు వచ్చేలా ఎత్తుగడ వేసాడా ?

ఎస్ ఇది ముమ్మాటికీ నిజం అంటున్నారు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు. ఈ విషయం రేవంతుడు ఎప్పుడో చెప్పేసాడు .. దాన్ని ఎవరంత సీరియస్ గా తీసుకోలేదు కాని యూపీఏ చైర్మెన్ సోనియా గాంధీ కి పక్కా సమాచారం ఉందట అందుకే చాలాకాలం తరువాత ఆమె రంగంలోకి దిగారు . అనారోగ్యం వాళ్ళ ఆమె చాలాకాలంగా పార్టీ నేతలనే కలవడం లేదు పైగా అధ్యక్ష బాధ్యతలు రాహుల్ అప్పగించారు. కానీ తెరాస అధినేత కెసిఆర్ తన తదుపరి గమ్యం ఢిల్లీ గద్దేనంటూ ఘింకరించాడు ….ఎస్ అందుకె థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సన్నాహాల్లో నిమగ్నం అయ్యారు . కార్యసాధన కోసం వేగంగా పావులు కదుపుతూ వస్తున్నారు.

దేశంలోని వివిధ రాజకీయపక్షాలతో తానే స్వయంగా సంప్రదింపులు జరుపుతున్నారు. మూడోకూటమి విధివిధానాలు ఖరారు కాలేదు అందులో చేరడానికి ఎవ్వరు ఇంకా ముందుకు రాలేదు. కానీ దేశ రాజకీయాల పైన అదేపనిగా మాట్లాడుతున్నారు. ఎన్ డి ఏ ,యూ పి ఏలతీరునే ఎండగట్టుతున్నారు . దీనితో కెసిఆర్ ఇక ఢిల్లీతో ఢీ సిద్ధమవుతున్నారనే చర్చలు మొదలయ్యాయి. కెసిఆర్ కూడా యూపీఏ పక్షాలుగా ఉన్న మమతా,హేమంత్ సొరేన్ , డీఎంకే ల తోనే సంప్రదించాడు

ఆమ్మో !ఇదేదో తమకే ఎసరు వస్తుందని కాంగ్రెస్ పెద్దలు అప్రమత్తం అయ్యారు విషయం తెలుసుకొన్న సోనియాగాంధీ బయటకు వచ్చి యూపీఏ పక్ష పార్టీ నేతలను మంగళవారం విందుకు ఆహ్వానించారు.అసలు ఈభేటీ ఫై కాంగ్రెస్ పార్టీ పైకి ఏమిచెప్తున్నా కెసిఆర్ మోడోకూటమి సన్నాహాలు చేస్తుండడమే అసలు కారణం.  అయితే విందు కు 20 పార్టీల ప్రతినిధులు వచ్చారు మమతా ,మాయావతి లు రాకపోవడంఫై ఆపార్టీ ప్రతినిధులని సోనియా స్వయంగా అరా తీశారు. ఎన్ డి ఏ కూటమి ఈ సారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ తమ కూటమినుంచి ఏ ఒక్కరు వెళ్లి పోకుండా జాగ్రత్త పడుతుంది .