అనుకున్నట్లే అయింది సినీనటి శ్రీదేవి మృతి అనూహ్య మలుపుతిరిగింది ఆమెగుండెపోటుతో మృతిచెందలేదని దుబాయి ఆరోగ్యశాఖ తెలియజేసింది ఆమె ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మృతిచెందినట్లుగా ధ్రువీకరించారు అదీగాక ఆమె మద్యంసేవించిఉన్నట్లు స్పష్టం చేసారు.

బాతురూమ్ లో కాలు జారి బాత్ టబ్ పడిచనిపోయినట్లుగా భావిస్తున్నారు కానీ శ్రీదేవి గుండెపోటు తోనే ఆదివారంఅర్ధరాత్రి చనిపోయినట్లుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది కానీ ఆసుపత్రి వర్గాలు ఆమె మృతిపై మొదట ఎలాంటి ప్రకటన చేయలేదు సోమవారంశవపరీక్షలు చేసారు ఆతరువాతే ఆమె మృతిపై నిర్దారణకు వచ్చారు ఆమె ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి చనిపోయిందని ప్రకటించారు. అలాగే ఈ మృతిలో ఎలాంటి కుట్రకోణం లేదని ప్రకటించారు .

దుబాయ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు సమీపబంధువుల పెండ్లి కి భర్త బోనికపూర్ కూతురు తో కల్సి ఆమె దుబాయ్ వెళ్లారు శనివారమురాత్రి భర్తతో కల్సి డిన్నర్కు వెళ్ళాల్సింది రెడీకావడానికి బాతురూమ్ లో వెళ్లి విగతజీవిఅయ్యారు సోమవారం మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో ముంబయికితీస్తున్నారు. గతంలో సినీనటులైన దివ్యభారతి ఆర్తీఅగర్వాల్ లు ఇదే తీరుగా అనుమానాస్పదం మృతిచెందారు