ఈపాటికే వివాహితమహిళలకోసం రూపొందించిన వరకట్న వేధింపుల నిరోధక చట్టం దాదాపుగా నీరుగారిపోయింది. ఇప్పుడు ఎస్ సి ,ఎస్ టి లకు సంబందించిన అట్రా సిటీ కేసుల విషయంలో సర్వోన్నత నాయ్యస్థానం మంగళవారం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని ఆ తీర్పు సారాంశందీనిపై తీవ్ర దుమారమే చెలరేగుతోంది . ఈపాటికే సవాలక్ష సమస్యలతో సతమతం అవుతున్న మోడీ సర్కార్ కు ఇదొక సమస్య కానుంది. కాంగెస్ పార్టీ బుధవారమే సుప్రీం తీర్పు ఫై కేంద్రాన్ని దుయ్యబట్టింది. ఆలస్యంగా తెలుసుకున్న దళితసంఘాలు సైతం గొంతుఎత్తు ఎత్త డానికి సిద్ధం అవుతున్నాయి.

అసలు సుప్రీం కోర్టు ఏమి చెప్పిందంటే ఎస్ సి , ఎస్ టి (వేధింపుల నివారణ) చట్టం 1989 కి సంబంధించే కీలకమైన వ్యాఖ్యలు చేసింది సుమారు 89 పేజీ ల తీర్పును వెలువరించింది


1) ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తే నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యద్దు.

2) కనీసం డీస్పీ స్థాయి అధికారితో ప్రాథమిక విచారణ చేసి నిజాలు తెలుసుకోవాలి ఆ తర్వాతే అరెస్ట్ చేయాలి .

3) ప్రభుత్వ ఉద్యోగి ఐయితే సంబంధిత నియామక విభాగం నుంచి అనుమతి పొందాకే అరెస్ట్ చేయాలి.

4) దురుద్దేశం తో కేసు పెట్టినా నేరం జరగలేదని ప్రాథమిక విచారణలో తేలినా ముందస్తు బెయిల్ ఇవ్వడంపై నిషేధమేమి లేదు.

5) అమాయకులను వేధించడానికి చట్టాలను దుర్వినియోగం చేస్తే అడ్డుకునే అధికారం మాకుంది .

6) సెక్షన్ 18 ని తామేమి నిర్వీర్యము చేయడంలేదు నిజంగా నేరము జరిగినట్లు ప్రాథమిక విచారణచేసి అరెస్ట్లు చెయ్యచ్చు .

7) పోలీసులు ,ఇతరులు దురుద్దేశం తో సామాన్యులపై వేధింపుల కోసం ఈ చట్టాన్ని వాడుతున్నారు ఇలా వాడినట్లు అనేక సందర్భాల్లో బయటపడింది .

గతంలోనూ ఇదే తరహా లో వరకట్నవేధింపుల చట్టం నీరుగారి పోయింది . మహిళలు ఈచట్టాన్ని దుర్వినియెగం చేస్తున్నారని అసలు సంబంధ లేని వాళ్ళను సైతం వరకట్న వేధింపుల కేసులో ఇబ్బందులకు గురిచేస్తున్నారని చాలామంది సుప్రీం కోర్టు ఆశ్రయించారు దీనితో అనేక కీలక సవరణలు జరిగాయి ఇప్పుడు ఆచట్టం తాలూకు భయమే లేకుండా పోయింది. ఈకేసులో వరుడి తాలూకు వారిపై కేసులు ఇష్టారీతినమోదు చేయరాదని చెప్పింది . చివరికి ఇప్పుడు కొన్సిలింగ్ పేరుతో విచారణ సాగదీసి స్టేషన్ బెయిల్ తో సర్దేస్తున్నారు . ఇక రాబోయే రోజుల్లో sc st అట్రా సిటీ కేసుల్లోనే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. కానీ సుప్రీం తీర్పు ఫై లొల్లి మొదలయింది ఏకంగా ఈ కేసు ను ఉన్నపలంగా పునసమీక్షించాలని కేంద్రం తన వైఖరిని సుప్రీం కు చెప్పాలని డిమాండ్ చేసింది. సరే ఆపార్టీ సంగతి పక్కన పెట్టితే అట్రా సిటీ ని నిర్వీర్యం చేయడం ఫై విమర్శల పరంపర కొనసాగే అవకాశం ఉంది. సుప్రీం కోర్ట్ లో రివ్యూ పిటిషన్ వేస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ చెప్పుతున్నారు. ఓకే చట్టం దుర్వినియోగం అవుతుండొచ్చుగాక కానీ ఆలా జరగకుండా యంత్రాగము చర్యలు తీసుకోవాలె తప్ప ఆచట్టానికి ఉన్న పదను తగ్గించడం సహేతుకం కాదు. అందుబాటులో ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలి ఆదిశగా సర్కార్ కసరత్తు చెయ్యాలి.