కెసిఆర్ తరహాలోనే జేఏసీ నేత కోదండరాం ఇక రాజకీయ పార్టీ సన్నాహాల్లో ఉన్నారు. తెలంగాణ కోసం మొదలైన ఉద్యమంలో ఈ ఆచార్యుడు చురుకుగా ఇంకా చెప్పాలంటే కెసిఆర్ ప్రతినిధిగానే ఉన్నారు అందుకే జేఏసీ బాధ్యతలు అప్పగించారు. కానీ రాష్ట్రం  ఏర్పడ్డాక వీరి మధ్య విబేధాలు వచ్చాయి . వాటిపై భిన్నకథానాలు ప్రచారంలో ఉన్నాయి బలమైన కారణంతోనే కెసిఆర్ కోదండరాం ను టార్గట్ చేసి ఉంటారు. అందుకే అయన ఎక్కడికి వెళ్లిన సవాలక్ష ఆంక్షలు అమలు చేస్తున్నారు .

అయినా ఆచార్యుడు మాత్రం వెనక్కి తగ్గడం లేదు పోలీసులు పెట్టె అన్ని నిబంధనలు పాటించి మరి తమ కార్యాలనుకొనసాగిస్తునారు . .జేఏసీ నుంచి రాజకీయ పార్టీ వైపు దృష్టి పెట్టారు అందుకే మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని కోదండరాం భావిస్తున్నారు ..సమావేశాలకు అనుమతులు ఎవరినీ అడ్డుకోవడం లేదు కదా అసెంబ్లీవేదికపై ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు కానీ వాస్తవ పరిస్థితులు బిన్నంగా ఉన్నాయి జేఏసీ నేత ఆచార్య కోదండరాం విషయంలో పోలీసులు నిబంధనలు తూ..చా తప్పకుండా పాటిస్తున్నారు.

ఏ జిల్లాకు వెళ్లిన ఏ కార్యం తలపెట్టినా నిఘావ్యవస్థ నీడలా వెంటాడుతుంది. సరే ఏపార్టీ అధికారంలోఉన్న రాజకీయ కార్యకలాపాల ఓకన్నేసి పెట్టడం ఈ వ్యవస్థకు అనివార్యమే కానీ కోదండరాం విషయంలో కొద్దిగా అతి చేస్తున్నారనే చర్చ అన్నివర్గాల్లో ఉంది. అసలు ఆయన్ని పోలీసులే హైలెట్ చేస్తున్నారు. ఉద్యమకాలంలో అయన ఏమిచెప్పిన ప్రజల్లో స్పందన ఉండే . తెలంగాణ కోసం ఎవరొచ్చి మాట్లాడిన జనం స్వచ్చంధంగా వచ్చారు జై కొట్టారు . కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఆలా లేవు. ఉద్యమంలో పెద్దన్న పాత్ర పోషించిన పార్టే అధికారంలో ఉంది. సో ఏమి చేసిన ఎలా చేసినా ప్రజల్లోకి సానుకూలంగానే వెళ్తుంది. దీనికి తోడు మీడియా సైతం నోరెత్తే పరిస్థితి లేదు.

ఈరోజుల్లో ఓ పత్రిక మనుగడ సాధించాలంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అనివార్యం కదా. కానీ ప్రజా సమస్యలపై మాట్లాడే వారి విషయం లో అణిచివేత ధోరణి ఫైనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జేఏసీ నేత కోదండరాం విషయంలో అవసరం లేని చర్యల కు దిగుతుంది. అదే ఆచార్యుని కలిసి వస్తుంది. ఇప్పటి దాకా ఏ నాయకునికి ఇవ్వని ప్రాధాన్యత కెసిఆర్ సర్కార్ జేఏసీ నేత కుఇచ్చింది అలాగే ఆయనమీద ఎక్కవ కేసులు నమోదు అయ్యాయి.

మొన్నటికి మొన్న ట్యాంక్ బండ్ ఫై ర్యాలీ కి అనుమతి ఇవ్వకపోగా హైదరాబాద్ కువచ్చే జేఏసీ కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్టులు చేసారు ఇంటినుంచి బయలుదేరిన కోదండరాంనూ లోపలకు నెట్టింది. గతంలో నిరుద్యోగ సభలావిషయంలోనూ ఇదే జరిగింది. అయన ఏ జిల్లాకు వెళ్లినా మఫ్టీ పోలీసులునీడలా వెంటాడుతున్నారు. ముందస్తుగా అనుమతి ఉంటేనే సమావేశాలకు వెళ్ళనిస్తున్నారు.ర్యాలీలు గట్రా జాన్తా నాయి రైతు సదస్సు కోసం మంగళవారం నిజామాబాద్ వెళ్లిన కోదండరామ్ కోసం కొందరు యువకులు డిచపల్లి నుంచి ర్యాలీ తీసుకెళ్లాలని భావించారు కానీ అప్పటికే అక్కడి వచ్చిన వారిని వారించి ఎదో భయపెట్టే ఆలోచనతో వారి ఫొటోలు తీశారు దీనితో స్థానిక జేఏసీ నేతలు ర్యాలీ రద్దు చేసారు . అయితే రైతు సభ ఆశించినంతగా జరగలేదు . కానీ పోలీసుల హడావుడే కనిపిం కనిపించింది .