ఒక్క క్యాస్టింగ్ కౌచ్ తోనే కాదు అనేక వివాదాలు తెలుగు సినిమా ప్రతిష్టను మసక బారేలా చేస్తున్నాయి. పైకి తామంతా ఒకే కుటుంబమని చెప్పుకుంటున్న, బయటకి పొక్కని ఆధిపత్య పోరుతో తెలుగు సినిమా రంగం దశాబ్దలా కాలంగా నలిగి పోతుంది. నాలుగైదు కుటుంబాల చేతుల్లోనే ఈ రంగం ఉండిపోయింది. అందుకే చాల మంది ఆర్టిస్టులు అవకాశాలు రావనే భయంతో ఏమి జరిగిన నోరెత్తరు. తమకు భజన చేసేవారిని లేదంటే తాము చెప్పినట్లు నడుచుకునే వారికీ ఛాన్స్ లు ఇవ్వడం ఈ రంగం లో ఆనవాయితి వస్తున్నదే. ఇప్పుడు సినిమా పెద్దలను వణికిస్తున్న క్యాస్టింగ్ కౌచ్ జాడ్యం ఎన్నో ఏళ్ల నుంచి ఉంది ఇంకా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ యుగం నుంచే మొదలయింది. ఎదో ఒకటి రెండు సిన్మాలు చేసిన శ్రీరెడ్డి చెప్పున్నా వాటినే మీడియా అబ్బో అబ్బో అంటూ రంకెలేస్తుంది.

ఎప్పటిలాగే tv9 ఓ అడుగు ముందుకేసి తన సహజ పైత్యన్నీ ప్రదర్శిస్తుంది. క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినిమా రంగంలోనే కాదు. అనేక రంగాల్లోని ఉంది అంతెందుకు టీవీ మీడియాలో లేదా అక్కడంతా పారదర్శకంగానే ఉందని ఎంత మంది నమ్ముతారు?సినిమా అంటేనే రంగుల ప్రపంచం కదా అన్ని రంగాల్లోనూ మంచి చెడు లు ఉన్నట్లు గానే ఎక్కడ మంచి చెడులు ఉన్నాయి. ఎప్పటినుంచో ఉన్న ఈ బాగోతం సంగతి ఆలా ఉంచితే అసలు తెలుగు సినిమా ప్రతిష్ట నానాటి దిగజారి పోతుంది. కులవారీగా , ప్రాంతాలవారీగా , పార్టీలవారీగా ఎప్పటికప్పుడు చీలిపోతూనే ఉంది. ఇంకా నిర్మాణo, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు నాలుగైదు కుటుంబాల చేతుల్లోకి వెళ్లి బందీ అయ్యాయి. దీనితో కొత్తగా వచ్చే వారు వీరి ముందు నిలబడలేక సర్వం కోల్పోయి తెరమరుగు అవుతున్నారు. కొంతమంది చేతిలోనే ఉండడంవల్లే ఈ రంగం అనేక వివాదాలతో నలిగి పోతుంది.

ఏపీ లో జరుగుతున్న హోదా ఉద్యమంలోను ఇదే జరిగింది. తెలంగాణ ఉద్యమ కాలంలో కనీసం అండగా ఉండక పొగ దిల్ రాజు లాంటి వారి అండతో కొందరు ఓవర్ యాక్షన్ చేసారు. కొందరయితే సినిమారంగం హైదరాబాద్ నుంచి తరలిపోవడం ఖాయమని ప్రచారం చేసారు. ఇప్పుడు అలాంటి వల్లే కెసిఆర్ పక్కన చేరి భజన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ,బాలయ్య లాంటి వారే కెసిఆర్ కు బాకాలు ఉదుతున్నారు. అందుకే రేవంత్ , పోసాని లాంటివారు చీల్చి చెండాడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి కనీసమద్దతు ఇవ్వని తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పడు ఏపీ లో మొదలైన హోదా ఉద్యమానికి దండుగా కదిలింది . అదీగాక ఓ టీడీపీ నేత దబాయించితే. దీనితో పరిశ్రమ ప్రతిష్ట మరింత దిగజారి పోయినట్లయింది.

దానికి తోడు పోసాని ఒక్కొరిని కడిగి పడేసాడు.హోదా ఉద్యమానికి చేయూత ఇవ్వడం లేదనే అక్కసుతో టీవీ5 యాంకర్ సినిమా రంగంలోని మహిళల ఫై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి ఎదో మొక్కుబడిగా కొందరు మాట్లాడారు. ఇలా ఎన్నో ఉదంతాలతో సినిమా రంగం తన ప్రతిష్టను కోల్పోతుంది. క్యాస్టింగ్ కౌచ్ఒక్కటే తెలుగు సినిమా ప్రతిష్ట ను కోల్పొలేదనేది గ్రహించాలి.