రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకుల సేవలోనే సేద తీరుతు…వారి పల్లకీలు మోస్తున్నాయి, కంటికిరెప్పలా కాపాడుతున్నాయి, వారి వైపు ఎవరు కన్నెత్తి చూసినా సహించలేక పోతున్నాయి. వారి జెండాను నిసిగ్గుగా మోస్తున్నాయి. ఆంతే కాదు వారి వారసులను ప్రజల నెత్తిన రుద్దే కార్యని తమ బుజాలమీదే మోస్తున్నాయి. పాపం ఎంతో బృహత్తకార్యని ముందుకు తీసుకెళ్లే పనిలో ఉంది. సామాన్యప్రజల కష్టాలు సమస్యలు ప్రస్తావించే కనీస తీరిక ఓపిక లేనిపరిస్థితిలో ఉంది. పాలకులకుముళ్ళు గుచ్చితే తమ పంటితో తీసే వరకు వెళ్లి పోయారు. అందుకే ఈ విపరీత పరిణామాలు …జనసేనఅధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ వాహనం ధ్వసం చేసిన ఉదంతం ఫై తెలుగు మీడియా అధిపతులు రంకెలేస్తున్నారు నానా యాగీ చేస్తున్నారు. తమ కాను సైరల్లో ఉండే జర్నలిస్ట్ సంఘాలను రంగంలోకి దించేసాయి. ఎదో ఉపద్రవం ముంచుకొచ్చి నట్లుగా మీడియా అధిపతులు ఓ హోటల్ లో చేరి తర్జన భర్జనలు చేసారు.

తామేమి చేసినా అన్ని మూసుకొని భరించాలని భావించే తెలుగుమీడియా కు పవన్ తీరు నచ్చక పోయిఉండొచ్చు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే మీడియాను నిలదీసే నిజం పవన్ కు ఉంది.గతంలో దక్కన్ క్రానికల్ కార్యాలయం ముందు బైఠాయించారు. అసలు తమ స్టూడియో లో కూర్చొని ఎవ్వరి బట్టలూడదీసిన మౌనంగా భరించాలిసిందేననే ధోరణి మీడియా అధిపతులో హెచ్చు మీరుతుంది. 2014 సాధారణ ఎన్నికల నుంచి టీడీపీకి అండగా ఉన్న పవన్ఈ మద్యేదూరం అయ్యాడు అసలే నిప్పు సార్ మోడీ తో కటీఫ్ చెప్పాడు. ఈ టైమ్ లో బాబుకు బాసటగా ఉండాలిసిన పవన్ బాబు,చినబాబు ల ఫై నిప్పులు చెరిగాడు. అంతే అప్పడిదాకా పవన్ ను అహో హోహో అన్న నిప్పు తాలూకు మీడియా ఆయన్ను టార్గట్ చేసింది. ఇప్పుడు బైబిల్ సూక్తులు వల్లిస్తున RK అసలు పవన్ రాజకీయాలకు పనికి రాడంటూ తేల్చి పారేసాడు.

అటు మోడీ ని ఇటు పవన్ ను అయన తూలనాడుతూనే వస్తున్నాడు. వైస్సార్సీపీ నేత జగన్ ఫై లెక్కలేనన్ని కథనాలు వేసారు. కానీ పవన్ ఏవో ట్వీట్ చేస్తే రాధాకృష్ణ ఊగి పోతున్నాడు. అబ్బో తానేదో శుద్ధ పూసల మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో ఉన్నవారికి సహనం ఉండాలనేది అందరూ చెప్పేదే కానీ ఎంతవరకు నేతల వ్యక్తిగతంలోకి వెళ్లి వారిని బజారుకు ఈడ్చే మీడియా వికార వైఖరి పైన చర్చ జరగాలి. బాబు కోసం ఏదైనా చేసుకొండి ఇంద్రుడు చంద్రుడు అంటూ రోజంతా కీర్తించండి దేశంలోనే అయన అంత గొప్పనాయకుడే లేడని నిజాయితీ కి మారు పేరని ఊరు వాడ ప్రచారం చేయండి అందులో ఎవ్వరికి బాధ లేదు అది మీ స్వేచ్చ ఎవ్వరు కాదనరు. కానీ ఆయన్ని హోదా పోరు హీరో చేయాలనీ ఎదుటి వారిని విలన్ చేయాలనే కుతంత్రo మీడియాకు ఉండకూడదు.

సినిమా పరిశ్రమలో వచ్చిన ఓ వివాదం లో తల దూర్చితమకు అనుకూలంగ మాట్లాడే వారిని స్టూడియోకి పిలిచి రోజుల తరబడిగా పవన్ లాంటి వారిని టార్గట్ గా చేసుకొని చర్చలు జరపడం వెనక ఏమి జరిగింది ?ఎలాంటి ఒప్పందాలు ఉంటాయి ?ఇట్టే తెలిసి పోతుంది.మీరు బరితెగించి ఏది చేసిన ఎదుటి వాడు ఏమి అనొద్దు అంటే ఎలా ఇదెక్కడి సేచ్ఛ. మీడియాముసుగు లో చిల్లర వేషాలు వేస్తె ఎలా. జగన్ లాంటి వారికైతే స్వంత మీడియా ఉంది మీరు ఒక్కటి రాస్తే అయన పది రాస్తాడు.కానీ పవన్ లాంటి వారు ఏమి చేయాలి. ట్విటర్ లో తనకు వచ్చిన సమాచారం మేరకు కొన్ని పోస్టు లు చేసాడు. అంతే మీడియా పెద్దల అహం దెబ్బతింది. పాలకుల పల్లకీలు ఎగబడి మోస్తున్న మీడియా ఇప్పుడు స్వేచ్ఛ పేరుతో రంకెలేస్తున్న తీరు నవ్వుబాటుగా మారింది.

పత్రికలు నిర్వహణ ఆర్థిక భారమే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అనివార్యమే కానీ అందుకు అనేక మార్గాలున్నాయి. రెండు ప్రభుత్వాలను నెత్తిన పెట్టుకొని ఊరేగండి. వారి భజన కోసం పోటీ పడండి. ఇప్పుడు జరుగుతుంది అదేకదా. మీ ఆర్థిక అవసరాలు తీర్చే ప్రభువుల మెప్పు కోసం ప్రతిపక్ష నేతలఫై ఏది పడితేఅది రాస్తాం అంటే ఎలా సార్లు . ప్రభుత్వాల అండ ఉందనే ధీమాతో మీడియా లో బరు తెగింపు ధోరణి మితి మీరుతుంది. ఇప్పడు మీ హక్కులు స్వేచ్ఛలకు వచ్చిన ప్రమాదమేమీ లేదుకానీ దారి తప్పుతున్న మీ పంథాపై ఆత్మ పరిశీలన అవసరం అది అనివార్యం కూడా .