ఎస్ …రేవంత్ రెడ్డి రంగంలో దిగడంతోనే సీను మారిపోయింది ...ఎప్పుడొచ్చామన్నది  కాదు బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఓసినిమాలో డైలాగు కాంగ్రెస్ నేతలకు అతికినట్లు ఉంటది ...మరి కాకా పోతే నిన్నటి ఘటనఫై సీనియర్ నేతల సొళ్ళు మాటలతోనే తెరాస ఎదురు దాడికి దిగింది. గాట్టిగా కోమటిరెడ్డి ని వెనుకేసుకొచ్చే వారే లేరు..మొద్దు నిద్రలోనుంచి బయటకు వచ్చింది . అసెంబ్లీ బడ్జట్ సమావేశాలు తొలి రోజు మండలి చైర్మెన్ స్వామిగౌడ్ ఫై దాడి ఘటనతో ఇరుకున పడిన కాంగ్రెస్ పార్టీ తేరుకుంది నష్టనివారణ చర్యలపై దృష్టి పెట్టింది అందులో భాగంగానే రేవంత్ ను తెరమీదికి తెచ్చింది……..

మనోడి సంగతి తెలిసిందే కదా పక్కగా ప్లాన్ చేసుకొని ఎదురు దాడి చేస్తాడు. ఈ ఘటనపై భిన్నకోణంలో మాట్లాడాడు కోమటిరెడ్డి హెడ్ సెట్ విసిరిన దృశ్యాలే చూపిస్తున్నారు . కానీ అది మండలి చైర్మెన్ కె తగిలిందని ఎలా చెప్పుతారు.? ఎడమవైపు ఉన్న కోమటిరెడ్డి హెడ్ సెట్ విసిరితే స్వామి గౌడ్ కుడికన్నుకు ఎలా తగిలింది…అసలు ఇవన్నీ ఎందుకు అసెంబ్లీ లో ఆరు సీసీ కెమెరాలు ఉంటాయని అందులో రెండు స్పీకర్ ఎదురుగానే ఉన్నాయని వాటిలో ఉన్న మొత్తం దృశ్యాలను బయటకి చూపించాలని డిమాండ్ చేసారు. కోమటిరెడ్డి విసిరిన హెడ్ సెట్ వెళ్లే మండలి చైర్మెన్ తగిలినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అవుందికదా .

మరి ఆ ఫుటేజ్ ఎందుకు లేదు అంటూ రేవంత్ ఎదురు దాడికి దిగాడు ఓకే ఓ కొత్త లాజిక్ చెప్పాడు నిజమే కదా అసెంబ్లీ సమావేశాలు నిరంతరంగా రికార్డ్ చేస్తారు వాటిని లైవ్ కవరేజ్ చేస్తారు మరి మండలి చైర్మెన్ ఫై ఎటు వైపు నుంచి దాడి జరిగింది చూచాయగానైనా తెలిసిపోతుంది కదా నిజంగా అదృశ్యాలు బయటికి వస్తేగాని రేవంత్ దూకుడికి కళ్ళెం పడదు సో తెరాస నేతలు ఇక ఆ పనిలో ఉండండి …..