పాలకులకపల్లకీ లు మోయడానికి పోటీ పడుతున్న తెలుగు మీడియా సామాన్యప్రజల కష్టాలు కన్నీళ్లు పట్టిచ్చుకునే పరిస్థితిలో ఎలాగో లేదు మారి సామాన్యులకు రక్షణకవచంగా మారిన సోషల్ మీడియాఫై tv9అక్కసు వెళ్లగక్కుతున్నది రోడ్డు మీది చెత్త ను స్టూడియోలో కి తెచ్చి రోజంతా జనం నెత్తిమీద రుద్దుతున్నారు అయినా వాటిమీద ఎవ్వరుపట్టించుకోరు ఎన్నో బోగస్ వార్తలు ప్రసారం చేస్తరు వీటి మీద కనీస చర్చ జరగదు కానీ సోషల్ మీడియాలోవచ్చే పోస్టింగులపై మాత్రంఏది నిజం?ఏది అబద్దం?అంటూ రోజు కనీసం గంటయినా రచ్చ చేస్తున్నది ప్రజాసమస్యలు ఎన్నో ఉన్నాయి వాటిపై కనీస సోయి లేని వీళ్లకు సోషల్ మీడియాలో వస్తన్న వార్తల్లో నిజం ఎంత అబద్దం ఎంత ఉందో పనిగట్టుకొని ప్రచారం చేయడం ఎందుకు అది కేవలం సోషల్ మీడియా విశ్వసనీయతను దెబ్బతీయడమే నిజంగా ఈరోజు సామాన్య ప్రజలకు ప్రింట్ & ఎలక్రానిక్ మీడియా అందనంత దూరంలోఉన్నది అదీగాక పాలకులకు వ్యతిరేకంగా నోరెత్తే పరిస్థితీ లేదు దానితోపాటు ఏదో ఒక పార్టీ బాకాఉదుతున్నాయి ఇవ్వన్నీ ఎందుకు వాళ్ళు ప్రసారం చేస్తున్న వార్తలన్ని నిజమేనా ఒక్కసారి వాళ్లే ఆత్మవిమర్ష చేసుకోవాలి ఎందుకంటే మొన్న నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అంటూ రోజంతా ఊదరగొట్టారు కానీ మరుసటిరోజే పెంచే ప్రసక్త్తియే లేదని కేంద్రం స్పష్టo చేసింది కనీస ఆదిశగా ప్రయత్నాలు కూడా జరగడం లేదని మరో పేపర్లో వచ్చింది కానీ ఎవ్వరూ tv9 ను తప్పు పట్టలేదుకదా వాళ్లకున్న సమాచారం మేరకు ఆ వార్త ప్రసారం చేసిఉంటారు ఆంతే కాని ఆ ఛానెల్ విశ్వసనీయతను ప్రశ్నించలేదు అయ్యబాబు మీరేటింగ్ కోసం ఏమైయినా చావండి కానీ సామాన్యులు కూడా గొంతులేత్తా డానికి వేదికగా ఉన్న సోషల్ మీడియా ను దెబ్బతీయ్యొద్దు ఎలాగో ప్రభుత్వం పదునైన చట్టాలు తెస్త్తుంది కదా నాయన మీకు ఎందుకు నొప్పి ముందు మసకబారి పోతున్న మీ విశ్వసనీయతను కాపాడుకోండి ప్లిజు.