జేపీ , జెడి లు తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని ఆఫీసర్ కామ్ లీడర్లు …దేశంలోనే అత్యున్నత ఐఏఎస్ ,ఐపిఎస్ ,ఐఆర్ఎస్ లాంటి సర్వీసెస్ ను వదిలి రాజకీయాలోకి రావడం కొత్తమీకాదు. ఆ జాబితా చాంతాడు అంత ఉంది కానీ తెలుగు రాష్ట్రాల నించి జేపి ….ఆతర్వాత జేడీ …ఇప్పుడు వీవీ ఈముగ్గురు ఏపీ లోని వివిద ప్రాంతాలకు చెందినవారు . వీవీ అంటే లక్ష్మినారాయణ అంటే ఎవరో తెలుసు కదు  ..జగన్అక్రమ ఆస్తుల కేసు అలాగే గాలి అక్రమ మైనింగ్ దందాపై సిబిఐ విచారణ జరిపిన క్రమంలోనే ఓవెలుగు వెలిగిన అప్పటి సిబిఐ జాయంట్ డైరక్టర్ వీవీ లక్ష్మి నారాయణ గురించి తెలుగు ప్రజలకు పరిచయమే అక్కరలేదు .

అయన నిజాయితీని ముక్కుసూటి వైఖరిని మన నిప్పు తాలూకు మీడియా ఆకాశానికి ఎత్తింది .ఇప్పుడు అయన ఆంధ్రప్రదశ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధం అవుతున్నారు. అయన ఏ పార్టీలో చేరబోతున్నారనేది అందరికి ఆసక్తిగానే ఉంది. కానీ ఇంకా చాల సర్వీస్ ఉన్నా స్వచ్ఛంధ పదవి విరమణ కోసం మహారాష్ట సర్కార్ కు దరఖాస్తు చేసాడు. ఎంతో ఓర్పు నేర్పు ఉన్న అయన ఎందుకు ఉద్యోగం వదిలేస్తున్నాడనేది చర్చ . రాజకీయాల్లోకి రావాలనే కుతూహలంతోనే ఉద్యోగం వదిలేస్తున్నాడా ?లేదంటే ఉద్యోగం ఫై విరక్తి చెందడా ?ఎందుకంటే సిబిఐలో డిప్యూటేషన్ ఫై పనిచేసి వెళ్లిన అతనికి మహారాష్ట్ర లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కనీస ప్రాధాన్యత లేని పోస్టింగ్లోకి నెట్టేసింది. సీబీఐ లో ఎన్నో సంచలన కేసులా దర్యాప్తులో సమర్థవంతంగా పనిచేస్త్తే ఇలా చేస్తారా ? అని వీవీ అసంతృప్తిగా ఉంటున్నారట ? మహారాష్ట్ర కేడర్ లోఉన్న ఆయన్ని జగన్ ,గాలి కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వమే ఏరి కోరి పంపింది .

వీవీ తెలుగువాడుకావడంతో కలిసొచ్చింది . అదే ఆయనకు దెబ్బేసింది . యూపీఏ హయాంలో నే అతను వెలిగిపోయాడు . అదీగాక కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువులుగా ఉన్న జగన్ , గాలి ల భరతం పట్టాడు రాజకీయంగా వారు కోలుకోకుండ. కాంగ్రెస్ పార్టీ వీవీ ని రాజకీయ అవసరాలకోసం వాడుకుందనే ఆరోపణలు వచ్చాయి . కానీ మహారాష్ట్ర లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. రెండుచోట్ల బీజేపీ అధికారంలోకి వచ్చింది . ఇక చెప్పదేముంది వీవీ ఫై కాంగ్రెస్ ముద్రవేసింది. మరో వైపు జగన్ ఫై పెట్టిన కేసులు ఒక్కక్కటిగా తుస్సు మంటున్నాయి తన సమర్థతనే సవాలు చేస్తున్నాయి . అదీగాక జగన్ కూడా బీజేపీపెద్దలకు చాల దగ్గరగా ఉన్నాడు. వీవీ అక్రమాస్తుల కు సంబందించి అతిగా చేసాడని ఎప్పటికప్పుడు మీడియాకు లీకులు ఇచ్చాడని జగన్ గుర్రుగా ఉన్నాడు చాలా సార్లు బాహాటంగానే ఆరోపించాడు.

ఢిల్లీలో బీజేపీ పెద్దలతో లాబీయింగ్ చేసిమరీ వీవీ ని వెంటాడు తున్నాడట. దీనికోసం జగన్ ఓ వ్యవస్థనే రంగంలోకి దించినట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది . ఇవ్వన్ని తెలిసే బాబు ఏపీ కి డిప్యూటేషన్ ఫై లక్ష్మినారాయణ్ తీసుకెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేసాడట ఆ విషయంకూడా ముందే పసిగట్టి జగన్ అప్రమత్తం అయ్యాడు . వీవీ ని ఏపీ కి తెచ్చుకోవడం వాళ్ళ అక్కడి ప్రజలకు జగన్ అక్రమాలు ఎప్పుడు గుర్తుండేలా చేయాలనేది నిప్పు సార్ ఆలోచన కానీ ఢిల్లీలో పాచిక పారలేదు. అంతిమంగా పాపం లక్ష్మి నారాయణ బాధితుడి అయ్యాడు . చివరికి ఉద్యోగం పైన్ విరక్తి చెందాడు. కానీ ఏ పార్టీ లో చేరుతాడనేది ఇంకా బయటికి రావడం లేదు. పవన్ కళ్యాణ్ తో కల్సి వెళ్తాడని కొందరు లేదు బీజేపీ లోకి వెళ్తాడని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. రాజకీయనేత రూపంలో వీవీ మరో సారి జగన్ కు మల్లీ ప్రతికూల పరిస్థితి ని ఎదుర్కోబోతున్నారు .