రాబోయే ఎన్నికల్లో తెరాస అధినేత కెసిఆర్ ఎక్కడినుండి పోటీ చేస్తారనేది ఆ పార్టీ లో చర్చినీయాంశం గా మారిందీ. ఎన్నకలకు ఇంకా ఏడాది సమయం ఉన్నపటికీ ఇప్పటినుంచె అగ్రనేతల పోటీ ఉత్కంఠ మొదలయింది. ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారనేదానిపై ఇంకా స్పస్టత రావడం లేదు అయినా ఎవ్వరికి తోచినట్లు వారు అంచనాలు వేస్తున్నారు ముఖ్యంగా కెసిఆర్ తోపాటు కేటీర్,కవిత,హరీష్ లు ఈసారి నియోజకవర్గాలు మారుతారని విసృతంగా ప్రచారంజరుగుతున్నది. కెసిఆర్ ప్రసుతం గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు ఆ ప్రాంతాన్ని బాగా అభివృధి చేసారు ముఖ్యంగా సాగు తాగు రంగాల్లో అత్యంత ప్రాదన్యత కల్పించారు. రహదారుల్ని విస్తరించారు..కానీ కెసిఆర్ మళ్ళీ గజ్వేల్ నుంచి పోటీ చేస్తారా ?లేదా ?అనే సందేహాలు క్యాడర్ లో మొదలయ్యాయి. తెలంగాణ.ఉద్యమం మొదలయి.నుంచి రాజీనామాల తో వచ్చిన ఉపఎన్నికలో ఆయన నియోజకవర్గాలు మారి పోటీచేశారు కానీ ప్రతిసారి గెలిచారు మహబూబునగర్, కరీంనగర్, మెదక్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రస్థానము కొనసాగింది. ముఖ్యమంత్రిగా రాష్ట్రాబివృద్ది చేసిన ఆయనకు ఈసారి వచ్చే ఎన్నికలు ప్రతిష్టగా మారాయి. పార్టీనిమరోసారి అధికారంలోకితేవడం ఆయన.బుజాలమీదే ఉంది..ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక అసలు కీలకంగా మారింది ఈపాటికే ఎన్నో సార్లు సర్వేలూ జరిగాయి ఫస్ట్ అగ్రనేతలు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాల.నేస్పస్టత వచ్చాకే మిగితా నేతల సంగతి తేలనుంది. ఎప్పటిలాగే కెసిఆర్ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మారుతారని ప్రచారం జరుగుతున్నది ఈసారి ఎక్కడినుంచి పోటీ చేస్తారనేది పై ఊహాగానాలు పార్టీలో ఉన్నాయి. తనకు రాజకీయంగా ఉన్నతిచూపిన సిద్దిపేట నుంచే మళ్ళీ బరి లోకి దిగుతారని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. మొదటినుంచి సిద్దిపేట కంచుకోట గా ఉన్నది కానీ ఇప్పడు హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు మరో నియోజకవర్గం కేటయించాలిసి ఉంటది .మెదక్ పూర్వజిల్లలో ఏ నియోజకవర్గం నుంచి అయ్యిన గెలిచే సత్తా హరీష్ కు ఉన్నది కానీ అధినేత అంతరంగం ఎలా ఉంటది అనేది ఇప్పుడే చెప్పలేము తాను సిరిసిల్ల ను వదల బోనని కేటీర్ ఈపాటికే స్పష్టం చేసారు.