వామ్మో!  తెరాస కూలీలా బెడద ఈసారి కూడా తప్పేట్లు లేదు. ఆపార్టీ ఆవిర్భావసభ కోసం ఎప్పటిలాగే నిధుల సమీకరణ కోసం ఆపార్టీ నేతలు మరోసారి కూలీలా అవతారం ఎత్త నున్నారా? అముసుగులో అడ్డగోలుగా వసూళ్లు చేయడానికి తెర లేవనున్నదా? అధినేత ఆదేశాలవంక తో అందినకాడికి వసూళ్లు చేసుకోనున్నారు?గతఏడాది కొన్నిప్రాంతాల్లో ఎలాంటి ఉదంతాలే అనేకం చోటు చేసుకున్నాయి. అధికారపార్టీ అందులోను కీలక నేతలు కావడం వాళ్ళ బడా వ్యాపారులే నోరెత్త లేక పోయారు కిమ్మనకుండా ఎంత అడిగితె అంత ఇచ్చేసారు. ఆతర్వాత లబోదిబో మన్నారు అప్పుడు ఆవిర్భావ సభా వరంగల్ లో పెట్టారు జనం తరలించే కార్యాన్ని మంత్రులు ఏం ఎల్ ఏ (MLA),ఎంపీ (MP)  లకు అప్పగించారు. అందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని అధినేతనుంచి ఆదేశాలు వచ్చాయి.

అదికూడా ఏదైనా వ్యాపారసంస్థ లోకి వెళ్లి కూలిపని చేసి సదరు యజమాని ఎంతోకొంత ఇచ్చే డబ్బును తీసుకోవాలి. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా బలవంతపు చర్యలకు అవకాశం లేకుండా ఈ తంతు జరగాల్సిoది కానీ చాలాప్రాంతాల్లో తెరాసనేతల కూలీ పనులు రచ్చ అయ్యాయి. కొందరు శాసన సభ్యులు మండలి సభ్యులు ఇదో దందా లాగా చేసారని విమర్శలు వచ్చాయి వరంగల్ సభ పేరు చెప్పి ఎవ్వరిని వదలకుండా వసూలు చేసారు. నిజామాబాద్ జిల్లా లో వ్యాపారులే కాదు డాక్టర్లు, స్కూల్ యజమానులను చందాల కోసం వేధించారు. అసలు జనం తరలించే దానికి ఐన ఖర్చు కన్నా రెండింతలు వసూలుచేశారు. జిల్లాలో ఓ .ఎం.ఎల్.ఏ డాక్టర్ల సంఘముతో గొడవకు దిగాడు. చాలచోట్ల ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి.

మరోవైపు పార్టీకి చెందిన వీఐపీ లు ముఖ్యనేతలు తాము కూలీ పనికి వస్తున్నామని చెప్పి బలవంతంగా వెళ్లి అయిదు లేదా పది నిముషాలు ఎదో హడావుడి చేసి వేల రూపాయలు వసూలు చేసుకున్నారు. యజమానులు వద్దని వారించినా నేతలు వినలేదు బడా వ్యాపారాలు కూలీ పనికి వచ్చిన తెరాస ప్రముఖులకు రూ లక్షల్లో ఇచ్చారు . కానీ అందులో పార్టీ సభ కోసం ఇచ్చారు ఎంత నొక్కేశారనేది బయటికి పొక్కనీయలేదు. ఉద్యమకాలంలో తెరాస అధినేత కెసిఆర్ ఇదే తరహాలో కూలి పని చేసి చందాలు అడిగేవారు కానీ ఎక్కడ వివాదాలు తలెత్తలేదు గతంలో ఈ ఫార్ములా సూపర్ సక్సస్ అయింది. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వసూళ్ల చేయడమే వివాదం అవుతుంది. గత ఏడాది ఎదురైనా చేదు అనుభవాలనేపథ్యంలో ఈసారి హైదరాబాద్ లో తెరాస ఆవిర్బవసభ కోసం ఆపార్టీ నేతలు కూలీలుగా అవతారం ఎత్తకుండా ఉంటె మంచిదని ఆపార్టీ శ్రేణిలు కోరుతున్నాయి .