ఎస్ … మన రేవంత్ చెప్పినట్లుగానే ఆంద్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.హోదా తో హోరెత్తిన రాజకీయాలు ఇప్పుడు కేంద్రప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు వైదొలిగే వరకు వచ్చాయి. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీనీ ఢీ కొట్టడానికి ఒక్కడుగు దూరంలో ఉన్నారు. గురువారం ఇద్దరు కేంద్రమంత్రులు సుజనా,అశోక్గణపతిరాజు లు తమపదవులకు రాజీనామా చేయనున్నారు. కానీ ఎన్. డి. ఏ. కు మాత్రం మద్దతుఫై వేచిచూసే ఆలోచనతో ఉంది. బుధవారం చంద్రబాబు రోజంతా వ్యూహరచనలో ఉన్నారు ఏపీ అసెంబ్లీ లో సుదీర్ఘ ఉపన్యాసం చేశారు రెండు రోజుల క్రితమే ఏం. ఎల్. ఏ., ఏం. ఎల్. సి. లతో పాటు ఏం. పి. ల తోనూ కేంద్రవైఖరిపై సమాలోచనలు జరిపారు. మొత్తానికి బీజేపీ నాలుగేళ్ళ రాజకియ బంధాన్ని తెంచేసుకుంది.

మోడీ నుంచి ఆశించిన సహకారం ఏపీ కి రాలేదని విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేరడం లేదనేది ఏపీ వాదనగా ఉంది…సరే బాబు చెప్పినట్టు నిధుల ఆశించినట్లురాకపోయినా మోడీ వైఖరిపైనే బాబు కొంతకాలంగా అసహనం తో ఉన్నారు ఆయన బాకా ఉదే మీడియానే రంకెలేసింది. బయటకు చెప్పని కారణాలు ఎన్నో ఉన్నాయట….సరే …సరే వాటి సంగతి పక్కనపెడితే అసలు బాబు కొద్దీ రోజుల్లోనే బీజేపీ తెగదెంపులుచేసుకొంటారని ఆ రాష్ట్రంతో గాని ఆపార్టీతో గాని సంబంధం లేని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేత రేవంత్ నాలుగు రోజుల క్రితమే కుండ బద్దలుకొట్టినట్లు చెప్పాడు. మోడీ అమితుమీ తేల్చుకొని టీడీపీ మంత్రులు రాజీనామా చేస్తారని జోస్యం చెప్పారు కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ విషయం ప్రస్తావన చేస్తూ బాబు కేంద్రం నుంచి బయటకు వెళ్లి కొత్త కూటమి చేస్తే బీజేపీ కె నష్టమని భావించే ఆర్ ఎస్ ఎస్ కేసుల బూచి చూపి కెసిఆర్ తో మూడో కూటమి పెట్టించారని రేవంత్ చెప్పుకొచ్చారు. కానీ బాబు ఏపీ అభివృద్ధి కి చేయూతనిచ్చే పార్టీ లకే మొగ్గు చూపుతారని ఆ అవకాశం బీజేపీ కాంగ్రెస్ లకే ఉంది .

బీజేపీతో ఎలాగో కట్ చేసుకున్నారు కాబట్టి బాబు కాంగ్రెస్ తోనె కలిసే అవకాశం ఉంది. టీటీడీపీ సమావేశంలో ఇందుకు సంబందించి సంకేతాలు ఇచ్చారని కానీ తెరాస జత కడుతారని ప్రచారం చేస్తున్నారని ఆలా చేస్తే టీడీపీ ఏపీ మళ్ళీ అధికారంలోకి రాలేదు ఎందుకంటే తెరాస అంటేనే ఏపీ ప్రజలు రగిలి పొతారు ఉద్యమ సమయంలో కెసిఆర్ ఏపీ ప్రజలను నానా తిట్లు తిట్టారు.ఆంధ్రలో తెరాస కు ఓటు బ్యాంకే లేదు మరి అలాంటిటప్పుడు తెరాస తో టీడీపీ ఏలా కలుస్తుందని రేవంత్ చెప్పుకొచ్చారు.అప్పుడు ఎదో కెసిఆర్ ఫై కోపం తో చెపుతున్నాడని లైటుగా తీసుకున్నం కానీ ఏపీ లో పరిణామాలు అచ్చమ్ అయన చెప్పినట్లుగానే జరుగుతున్నాయి. ఏమో బాబు కాంగ్రెస్ తో జత కట్టలేడని చెప్పలేం ?