ఆరు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసమే టీడీపీ ని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారుఎన్టీఆర్. NTR  తొమ్మిది నెలలకే అధికారంలో వచ్చాడు. పాలనలో తనదయిన ముద్ర వేసుకున్నారు. అలాంటి మహానేతపేరుతో ఓజిల్లా ఉండాలనే తలంపు ప్రతిపక్ష నేతకు రావడంమంచిదే. ఎన్టీఆర్ సొంతఊరు నిమ్మకూరుకు పాదయాత్రతో వెళ్లిన జగన్ తాను అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చారు. దీనిపై టీడీపీ నేతలు ఏమి మాట్లాడలో తెలియక బిక్క మొహాలు వేశారు ఎప్పటిలాగే ఓ బ్యాచ్ ను రంగంలోకి దించి జగన్ ఫై పాత పురాణం చదివించారు. తర్వాత కథ తెల్సిందే కదా నిప్పు తాలూకు మీడియా ఊదరగొట్టేసింది. ఎన్నో సార్ల ఢిల్లీ రాజకీయాలను ఒంటి చేత్తో గిరగిరా తిప్పిన బాబు ఎన్టీఆర్ కోసం భారతరత్నఇప్పించ లేకపోయారు.

ఇంకా అయన బొమ్మతోనే ఎన్నికలకువెళ్లలేని పరిస్థితి. అధికారంలోకివచ్చి నాలుగేళ్లు అయ్యింది. కనీసం అయన సొంతజిల్లా కు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ఆలోచనే బాబు రాలేదు సరే అయన రాష్ట్రం కోసం సరిగా నిద్రకుడా పోవడం లేదు . 25 విదేశపర్యటనలు చేసారుక్షణం తీరిక ఉండడం లేదు బహుశా అందువల్లే ఎన్టీఆర్ ను మరిచి పోయివుంటారు దానికే గాబరా ఎందుకు ?సరే కృష్ణా జిల్లాకుఎన్టీఆర్ పేరు పెడుతానంటే హర్షం వ్యక్తం చేయాల్సిన టీడీపీ నేతలు జగన్ ఫై ఒంటికాలు మీద లేచారు. ఎన్టీఆర్ సంగతి పక్కనబెట్టండి మా బాబు తిరుపతి లో ధర్మదీక్ష చేసే రోజ్ ఈ మాట చెప్పడం ఏమిటి?అసలు ఎలా స్పందించాలో తెలియక టీడీపీ నేతలు దిక్కులు చూస్తునారు. ఏపీలో హోదా తాలూకు సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతూనే నాలుగేళ్ల తర్వాత నిద్రలేచి హోదాపోరులో కొంతైనా ఖ్యాతి పొందాలనే ఆలోచనతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యయప్రయాసలు పడుతున్నాడు.

మోడీ తో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఎప్పటిలాగే ఆత్మగౌరవ సెంటిమెంట్ అస్ర్తాన్ని వదిలాడు. ఏపీ ప్రయోజనాల పరిరక్షకుడి ముద్ర కోసం బాబు పడుతున్న కష్టాలు అన్నిఇన్ని కావు. ఇక అయన తాలూకు మీడియా సర్కస్ ఫీట్లే చేస్తుంది. ఇలాంటి కష్టకాలం లో బాబు అండగా నిలబడి ఓదార్పు చేయాల్సింది పోయి బాబు ఇలా ఇరకాటంపడేస్తే ఎలా?సుదీర్ఘ పాదయాత్ర లో జగన్ కూడాకొంత రాజకీయ పరిణితి చెందారు అందుకే నిమ్మకూరువెళ్లి కృష్ణా జిల్లా కు ఎన్టీఆర్ పేరు పెడతానని ఆనా చేసారు.