ఆంద్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అస్థితత్త్వం కోలుపోతున్నది. అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అమరావతికి పరిమితి అయ్యారు కొత్త రాజధాని నిర్మాణమే ఆయనకు సవాలుగామారింది కేంద్రం ఆశించినంత సహకరించడం లేదు ఈ నేపథ్యములోనే అక్కడ ప్రత్యేకహోదా అంశం తెరమీదికి రావడం అన్ని పార్టీలు దీనిపై రగడకు దిగాయి మిత్రుడిగా ఉన్న జనసేని సైతం ఇదే బాట పట్టడంతో బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేంద్రం తీరుతో ఇప్పటికే రగులుతున్న బాబు అమితుమీకి సిద్ధం అవుతున్నారు దీంతో అయన తెలంగాణలో పార్టీని పట్టించుకొనే పరిస్థితిలో లేరు పార్టీకి తూరుపుముక్కగా ఉన్న రేవంత్ ఇప్పుడు లేదు దీనికి తోడు పార్టీ తెరాసలో విలీనం చేయాలంటూ మోత్కుపల్లి లాంటి నేతలతో పార్టీ కావలిసినంత నష్టమవుతూనేఉన్నది. ఉన్నఒకరిద్దరు నాయకులను వైరాగ్యం ఆవరించింది ఎదో పార్టీలోఉన్నాము అన్నట్లు ఉన్నారు స్వతగా నిర్ణయాలు తీసుకోని పార్టీని ముందుకు తీసుకెళ్లే కనీస ప్రయత్నాలు చేయడం లేదు. బాబు ఇప్పుడు ఇటువైపు చుసేపరిస్థితి ఎలాగో లేదు కదా మరి ఏ టీడీపీ నేతలకు ఏమి రోగం .

పార్టీలోకి కొత్తరక్తన్నీ తీసుకరావాలని బాబు ఈపాటికే అనేకసార్లు టీటీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు అయినా ఉలుకు పలుకు లేదు ఎవరైనా పార్టీలోకి వస్తామని ఆసక్తి చూపినా ముందు మీ జిల్లా సీనియర్ నాయకులను ప్రసన్నం చేసుకొని మావద్దకు రండి అంటూ వచ్చినవారిని డీలా పడేస్తున్నారు ఎదో తాయిలాలు చూపి పార్టీ లో కి తీసుకోవాల్సిది పోయి బెదరగొట్టే మాటలు చెప్పి ఆఫీస్ వైపు రాకుండా చూసున్నారు. ఓ సీనియర్ నాయకుడు ఏకంగా పార్టీపరిస్థితి ఏమిబాగా లేదు నేను రేపోమాపో తెరాస లో వెళ్ళబోతున్న మీరువచ్చి ఏమిచేస్తారు అంటూ దెప్పుపొడుస్తన్నారు. దింతో చాల మంది ఔత్సాహికులు వెనకడుగు వేస్తున్నారు పార్టీ మొదటినుంచి తటస్తులని ప్రోత్సహిస్తున్నది ఏకంగా ఎంపీ మ్మెల్యే టికెట్స్ ఇచ్చింది అదే ఆశతో ఇప్పుడు కొత్తవారు వస్తున్నారు కానీ మేము ఉన్నాం అని ఎదో భరోసా ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించాల్సింది. పోయి ఏ హామీ ఇవ్వం వస్తేరండి లేదంటే పోండి అంటూ బీరాలు పలుకుతున్నారు సీనియర్ నాయకుల ముసుగులో ఏళ్ల తరబడిగా పార్టీపట్టించుకొని నేతలే ఇప్పుడు కొత్తవారిని రానివ్వకుండా కుయుక్తులు పన్నుతున్నారు .రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ ఉత్సాహవిగ్రహంగా మారిపోయారు.

మొదటినుంచి సౌమ్యుడిముద్ర ఉన్న ఆయన సీనియర్ల చాటు నేతగా మారిపోయారు వారిని కాదని అడుగుముందుకు వేయడం లేదు బలహీనవర్గాల ప్రతినిధిగా ఈ అవకాశాన్ని వాడుకొని రాష్త్రంమొత్తం విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేయాలిసింది. కానీ ఆ దిశగా ఒక్కఅడుగు కూడా వేయలేకపోయారు పార్టీలో తనదైన ముద్రవేసుకోలేక పోతున్నారు. ఈ పాటికే ఆయన కెసిఆర్ ఉపాధి కూలీ అంటూ దుమ్ముఎత్తి పోశాడు అయినా రమణ కూడా ప్రభుత్వంపై కనీస పోరాటాలు చేయలేక పోయారు ఇక పార్టీ ఎలా బల పడుతుంది అందుకే సెటిలర్ ఓట్లను కొల్లగొట్టే మాస్టరు ప్లాను తో కెసిఆర్ ముందుకు రాబోతున్నాడు అసలు ఓటుబ్యాంక్ చేజారాక పార్టీదిక్కూదివానా లేకుండా పోయేప్రమాదం ఉన్నది.