నాలుగేళ్లుఅధికారం పంచుకొని వెంకయ్య లాంటి వారితో చెట్టాపట్టాలు వేసుకొని ఒకరినొకరు పొగడుకొని ఒకరికొకరు ఇచ్చిపుచ్చు కొని ఇప్పుఎందుకు రగిలి పోతున్నారు అసలు ఈచంద్రులకు ఏమైంది? మొన్నటిదాకా మోడీ పల్లకి మోసినవీరిద్దరు ఇప్పుడెందుకు కాలుదువుతున్నారు? ఢిల్లీతో ఢీ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు? రాజకీయవ్యహరచనల్లో నిష్ణాతులుగాముద్రవున్న ఈఇద్దరికి మోడీతో ఎక్కడ చెడింది? ప్రతికూలపరిస్థితులను అధిగమించి రెండోసారి సొంత రాష్ట్రల్లో అధికారంలో రావడం ఆషామాషీ కాదు అదీగాక యిద్దరూతమ పుత్రరత్నాలనురాజకీయంగా మరింత పైకి తీసుకెళ్లే పనిలోఉన్నారు.

ఈ టైమ్ లో కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం ఫై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయమైంది. ఈఇద్దరు ఇప్పుడు కలిసికట్టుగానే ఏకకాలంలో మోడీ ఫై సమరబేరి మొదలుపెట్టనున్నారు. మొదట ఉప్పునిప్పులా ఉన్న చంద్రులు చేతులు కలిపి దేశంలో ఓ కొత్త రాజకీయవేదికను సిద్ధం చేసేపనిలో ఉన్నారట? ఓటుకునోటు కేసు నుంచి ఏకం అయిన వీరు ఢిల్లీలో చక్రం తిప్పేపనిలో నిమగ్నం అవడంపై కమలనాధులు రుసరుస లాడుతున్నారు . మొదట ఆంధ్రప్రదేశ్ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు విషయానికి వద్దాం వెంకయ్య ప్రోద్బలంతో కేంద్రం నుంచి మంచి సహకారం పొందిన బాబు ఓటుకునోటు కేసులో ఎదురైనా ఇబ్బందులను అధిగమించి కెసిఆర్ తో దోస్తానికుదరడంలోనూ మోడీ సహకారం పొందారనేది బహిరంగరహస్యం.

అప్పటిదాకా హోదా వద్దని ప్యాకేజిఇచ్చిన కిమ్మనని బాబు ఇపుడు ఎందుకు ఎదురు తిరుగుతున్నాడు?వైసీపీనేత జగన్ ను మోడీ కలవడం అతని కేసులో ఈడీ దూకుడు తగ్గించడంతో పాటు పోలవరంనిర్మాణంలో తలదూర్చడం వంటివి బాబుకు ఎంతమాత్రం నచ్చలేదు వీటికి తోడు తనకు నమ్మకస్తుడిగా ఉన్న వెంకయ్యాను ఉపరాష్ట్రపతి పంపడం మోడీ అపాయింట్మెంట్ కూడా దొరకకపోవడం వంటి విషయాల్లో బాబు రగిలిపోయాడట! దీనికితోడు బీజేపీ నేతలుతనపై ఇష్టారీతిన మాట్లాడం కేంద్రము నుంచి మునుపటి చేయూత లేకపోవడంవంటివి బాబును మోడీ నుంచి దూరం చేసినట్లు అయన సన్నిహితులు చెపుతున్నారు. ఆశించిన అభివృద్ధిజరగలేదు ఆ అపఖ్యాతి తనకు అంటకుండా బాబు దిద్దుబాటు చర్యల్లో భాగంగానే నిరసన గళం ఎత్తారు…….

మరి కెసిఆర్ మాటేమిటి ఆయనెందుకు మండిపోతున్నారు మోడీ సర్కారు లో చేరకపోయిన అండగా ఉన్నారు నోట్లరద్దు జి ఎస్ టీ లాంటి మోడీ మార్క్ చర్యలను సమర్తదించారు. నాలుగేళ్లనుంచి మోడీ సఖ్యతగానే ఉన్నారు మిషన్ కాకతీయ భగీరథ లకు నయాపైసా ఇవ్వక పోవడం అలాగే ముస్లింరిసర్వేషన్ లపై మోడీ సహకరించక పోవడంవల్లే కెసిఆర్ తిరగబడ్డరని తెరాస నేతలు పైకి చెప్తున్నారు కానీఎదో బలమైన కారణం ఉండేఉంటుంది. నిధుల కోణంలో కాకుండా ఇది ఎదో రాజకీయ కోణమే ఉంటది.

రెండోసారి తెరాస అధికారంలోకి రావడం ఖాయమని ధీమాతో ఉన్న కెసిఆర్ రాష్ట్రాన్ని కేటీఆర్ కు అప్పగించి తాను ఢిల్లీలో ములాయం తరహాలో ఉండాలని బావిస్తుండొచ్చు. ఎందుకంటే కేటీఆర్ ఈపాటికే రాష్ట్రమొత్తం చుట్టాచ్చారు కెసిఆర్ లేకుండానే బహిరంగ సభల్లో మాట్లాడారు. అసలు ప్రభుత్వంలోకేటీఆర్ అత్యంత కీలక పాత్రపోషిస్తున్నారు . దీనితో ఆయనే తదుపరి సీఎం అవుతారనే చర్చ అంతటా ఉంది.అందుకే కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ ఫై దూకుడు పెంచారు. దేశవ్యాప్తం కొత్త సమీకరణాలఫై చర్చకు తెర తీసారు.