రాబోయే సాధారణ ఎన్నికలకోసం ప్రధాన రాజకీయ పక్షాలు సమాయత్తం అవుతున్నాయి. ఈసారి బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకే అన్నిపక్షాలు ఏకం అయ్యాయి. ప్రధానిగా మోడీ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయనకు ప్రజల్లో మునుపటి ప్రాబల్యం లేదని ప్రతిష్ట తగ్గి పోయిందనికొన్ని సర్వేసంస్థ నివేదికలతో కాంగ్రెస్ పార్టీ సంబరపడుతుంది. మోడీని మరోసారి ప్రధానిగాచూడబోమని 45 శాతం మంది చెప్పారట కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీఅధికారంలోకి వస్తున్నదని మరో సంస్థ తేల్చేసింది కానీ మోడీ మానియా తగ్గింది. కానీ ప్రధానిగా ఎవరు ఉండాలని అడిగితె 45 శాతం మంది మోడీ అంటున్నారు మరి రాహుల్ కు 30 శాతం దాటడం లేదు ఇక దేశంలోనే సీనియర్ నేతగా ఉన్న ఏపీ సీఎం బాబు పేరు 2 శాతం జాబితాలో ఉంది మహానాడు వేళా ఇది తెలుగుతమ్ముళ్లు జీర్ణించుకోవాలి మరి తప్పదు.

మోడీ ప్రభ తగ్గి పోతుందని సంకలెగరేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రాబల్యం తగ్గుతూనే ఉంది. సారథి గాఉన్న రాహుల్ సైతం వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోలేకపోతున్నారు. అయన నాయకత్వం పార్టీ ఆమోదించిన ప్రజల్లో మాత్రం ఆదరణ ఏ మాత్రం పెరగడంలేదు. కేవలం మోడీ మీద పెరుగుతున్న వ్యతిరేకతపై నే ఆశలు పెంచుకుంటున్నారు. అంతేకాని ప్రజల్లో పార్టీ పెరుగుతున్న ప్రతికూలతను ఎలా అధిగమించాలో ఆ పార్టీ దృష్టి పెట్టలేక పోతుంది. మొదట్లో ప్రాంతీయ పార్టీలను ఆదిలోనే తుంచేసే వైఖరితో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చివరి మెట్టుదాకా దిగి పోయింది. కేవలం ప్రాంతీయ పార్టీలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్ష మారాయి. చివరికి చంద్రబాబు లాంటి నేతలతోనూ చేతులు కలపాల్సిన పరిస్థితిలోకి వెళ్లి పోయింది. తాను ప్రధానమంత్రి కావడం కన్నా మోడీ మరోసారి ప్రధాని కావొద్దనేది రాహుల్ ఆలోచన ఉంది.

మోడీ మళ్ళీ వస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది కదా. అందుకే మొన్న కర్ణాటక ఎన్నికల్లో అన్ని పార్టీలు ఓడిపోయినా గెలుపు సంబరాలు చేసుకుంటున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ మరోమారు అధికారంలోకి రాకుండ కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని ప్రాంతీయపార్టీలలనుఒకేగొడుగు కిందికి తేవడానికి కుమారస్వామి ప్రమాణస్వీకారాన్నీ అనుకూలంగా మల్చుకుంది. రాజకీయాల్లో పరిణితి చెందిన నేతగా ఎదగడానికి రాహూల్ గుజరాత్, కర్ణాటకఎన్నికలు ఉపయోగపడ్డాయి. నాలుగేళ్లుగా ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్ సారథి 2019 లో తాను ప్రధాని కుర్చీ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నట్లుచెప్పారు. అంటే ప్రధానమంత్రి అయ్యే అర్హత ఉన్నట్లు తనకు తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసాడు ఇదంతా కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు జరిగిన కథ కానీ ఫలితాల తర్వాత దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి.

కర్ణాటక లో రెండోసారి పార్టీని అధికారంలోకి తేవడానికి యువనేత రాత్రిబవళ్ళు శ్రమించారు. ముఖ్యమంత్రిగాఉన్న సిద్ధరామయ్యఫై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అనుకూల పరిస్థితులే ఉన్నాయని భావించారు. అదీగాక పగడ్బందీ ప్రణాళికతో కదిలారు బీజేపీ ని జేడీఎస్ ను లక్ష్యంగా చూసుకొని ప్రచారం చేసారు. కెసిఆర్ తో కల్సి ఎంఐఎం మద్దత్తు పొందిన దేవెగౌడ ఫై కాంగ్రస్ ప్రచారంలో నిప్పుచెరిగింది. మరో వైపు రెండో సారి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భావించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ సారథులు అయిదారు భారీ సభలతోనే ప్రచారం ముగించేవారు కానీ రాహుల్ రోడ్ షోలు పాదయాత్రలు గుళ్ళు మఠాలు తిరిగారు కూడాఅయినా ఫలితాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. బీజేపీ అధికారానికి కేవలం 8 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అధికారం బీజేపీ కి దక్కకూడదనే ఆలోచనతో 38 సీట్లతో మూడో స్థానంలో నిలిచిన జేడీఎస్ కు సీఎం కుర్చీ ఏరా చూపి దోస్తీ కట్టింది.

అనేక నాటకీయ పరిణామాల జరిగి కుమారస్వామి ముఖ్యమంత్రిగాఅయ్యారు. ఈ ఉత్సవానికి దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించారు ఇది తెరవెనకనుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన పనే. ఎందుకంటే తత్త్వం బోధపడింది మోడీ ఎదిరించాలంటే ప్రాంతీయ పార్టీలతో జత కట్టడం ఆ పార్టీకి అనివార్యం అయ్యింది. తానే ప్రధానమంత్రి అవుతానని చెప్పుకున్న రాహుల్ ఇప్పుడు మోడీ కి ఆ కుర్చీ దక్కకుండా ఉంటె చాలు అనే స్థాయి వచ్చేసారు. అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇక బీజేపీ అధికారంలోకి రాకుంటే చాలు అనే స్థాయి కి వచ్చేసింది.