మూడు ఈశాన్య రాష్ట్రల్లో ఎన్నికల ఫలితాలు దేశరాజకీయాలను మలుపు తిప్పనున్నాయి . మరో ఏడాది లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యములో ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉత్కంఠంగా మారాయి ప్రధాన పార్టీల కంచుకోటాలు కులనున్నాయి ఈ రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుతున్నారు దీనితో దశాబ్దాల కాలంగా అధికారంలో ఉన్నపార్టీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి . ముఖ్యంగా త్రిపుర రాష్ట్రము కమ్యూనిస్ట్ ల కు చివరి అధికారపీఠం దూరం కానున్నది దేశంలోనే పేద ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సర్కారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కుంటున్నారు . ఏపార్టీతో నూ పొత్తులేకుండా రెండున్నర దశాబ్దాలుగా కమ్యూనిస్టులు పాలిస్తున్న ఏకైక రాష్ట్రం త్రిపురే . కాని ఈసారి ఎన్నికల్లో అధికారం కోలుపోనున్నది అక్కడ కాషాయం జెండా ఎగరనున్నది …..

ఎస్   ….ముందస్తు ఫలితాలు అవే చెపుతున్నాయి అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతున్న సిపిఎం పార్టీ ని త్రిపుర ఫలితాలు మరింత కుదుపేయ నున్నాయి ఆపార్టీ సంగతి పక్కనబెడితే బీజేపీ మొదటిసారిగా ఈశాన్యరాష్ట్రలో పాగావేయనున్నది సుమారుగా 45-50శాతం ఓట్లు ఆపార్టీ సాదిస్తుందని సర్వేలు చెపుతున్నాయి ఏడాది కాలంగా అగ్రనేత రామ్ మాధవ్ రంగంలోకి క్షేత్రస్థాయి లో పనిచేస్తూ వచ్చారు చివరికి ఆయన్ని తీవ్రవాదులుసైతం టార్గెట్ చేసారు అవేవీ లెక్కచేయకుండా పనిచేసి ఫలితాలు సాదించారు త్రిపుర తోపాటు నాగాలాండ్ లోనూ NDPP తో అధికారం పంచుకోనున్నది ఈ రెండు రాష్ట్రల్లో అధికారంలోకి రావడం ఖాయం మనే ధీమాతో ఉన్నది.

ఇక మేఘాలయ లో కాంగ్రెస్  పార్టీ అధికారం కోలుపోనుంది దీనితో ఆపార్టీ ఈశాన్యం లో ఒక మిజోరాం కె పరిమితం కానుంది రాహూల్ పార్టీ అధక్ష్యభాద్యతలు చేపట్టాక ఇది రెండోసారి ఓటమి పలకరించినట్లు అవుతుంది . అయితే ఇక్కడ ఏవరుఅధికారంలోకి వస్తారనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు . మాజీ స్పీకర్ సంగ్మా నేతృత్యంలో ఎన్ సి పి పార్టీ గట్టిపోటీ ఇస్తుంది దేశంలో ప్రధాని మోడీ పాలనపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత వుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నారు అయినప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ సానుకూలపలితాలు సాదిస్తుండడం గమనార్హం . మోడీ సైతం ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృతంగా ఎన్నికల్లో ప్రచారం జరిపారు దీనితో ఆయన చరిష్మా ఎంతమాత్రం తగ్గలేదని శనివారం వెల్లడి కానున్న పలితాలతో తేలనున్నది .