ఆర్మూర్ ప్రాంతంలో రెండు దశాబ్దాల కాలం నుంచి అనూహ్యంగా పెరిగిన సాగు విస్తేర్ణంతో ఎర్రజొన్న పంటకు డిమాండ్ మొదలైంది. వ్యవసాయంలో పద్ధతులు కాకుండా సానుకూల పరిస్థితుల నేపదాయంలో పంటను సాగు చేసే ఆర్మూర్ ప్రాంత రైతులు ఎర్రజొన్న పంటఫై దృష్టి సారించారు. కానీ ప్రఠీ ఏటా వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడంలో చేతులు ఎత్హిస్తున్నారు. దింతో పెట్టుబడి కుడా అందని పరిస్థితుల్లో రైతాంగం లబోదిబోమంతుంది. 2008లో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఎర్రజొన్న పంట కొనుగోలు చేసిన ఓ బడా వ్యాపారి రైతులకు డబ్బులు చెల్లించే విషయంలో చేతులేతేయడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. వారం రోజుల పాటు రోడ్లపైనే తిష్ట వేశారు. కానీ యంత్రంగం లోపాయికారిగా సదరు వ్యాపారులతో కుమ్ముకు కావడంతో ప్రభుత్వ స్థాయిలోను ఈ సమస్యకు పరిష్కార మార్గం కనిపించలేదు. దింతో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. వ్యాపారి ఇంటిని పెట్రోల్ పోసి దహనం చేసారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు కాలుపులు జరపడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు. ఈ ఘటన అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. ఆ తర్వాత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కి ఈ ఉద్యమ తాలూకు ప్రతికూల పరిశితులు తలెత్తయి . ఈ లోపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డంతో ఎర్రజొన్నల వివాదం సద్దుమణిగింది.

2014లో సాధారణ ఎన్నికల్లో తెరాస పార్టీ పాలన పగ్గాలు చేపట్టాకా ప్రభుత్వం ఎర్రజొన్నల రైతులకు బకాయిలను కొంత మేరకు చెల్లించి చేతులు దులుపుకుంది. సారిగ్గా దశాబ్డా కాలం తర్వాత మల్లి ఎర్రజొన్న తాలూకు ఉద్యమం ఆర్మూర్ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుంది. పధీ రోజులుగా చాప కింద నీరులా సాగుతున్న ఉద్యమం గురువారం ఉగ్ర రూపాన్ని దాల్చింది . పోలీసుల నిషేధాజ్ఞలు తోసిరాజని రైతాంగం రోడ్డెక్కడం ప్రభుత్వం లోను ప్రకంపనలు మొదల యేలా చేసింది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాదు రురల్ నియోజకవర్గంలోని ఆర్మూర్, నందిపేట, ముకపాల్, వేల్పూర్, మోర్తాడ్ జకరాన్పల్లి మండలాల్లో 110 గ్రామాలలో ఈ ఏడాది సుమారు 50 వేల ఎకరాల్లో ఎర్రజొన్న పంటలను రై1తులు సాగు చేశారు. పంట విస్తీర్ణం అద్ధికమైదని సీడ్ వ్యాపారులు సిండికేట్ గా మారి క్వింటాల్ కు రూ. 1700 నుంచి రూ. 1800 వరకు 10 కిలోల తరుగును తీసి కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. క్వింతాల్ కు రూ . 1800లతో పాటు 10 కిలోల తరుగుతో విక్రయిస్తే పెట్టుబడి ఖర్చు సైతం రాదని రైతులు ఆందోళన చేయాలనీ కమ్మరపల్లి, మోర్తాడ్లలో దశల వారీగా ఆందోళన చేసిన ప్రభుత్వం స్పందించలేదు. దీంతో పార్టీలకతీతంగా రైతులు ఏకమై రైతు ఐక్య కార్యాచరణ చేస్తూ రైతులు ఆమరణ దీక్ష చేపడతారని గురువారం దీక్షలను చేపట్టారు.