నిషేధాజ్ఞలు ఉల్లంగిస్తూ ఆర్మూర్ ఎర్రజొన్న రైతులు గురువారం రోడ్డెక్కారు . ఎర్రజొన్నలకు కనీస మద్దతు ధర ప్ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆందోళనకు పిలుపునిచ్చింది . కానీ ఆర్మూర్ ప్రాంతంలో 144 సెక్షన్ విధిస్తు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ బుధవారం రాత్రి అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నిషేధాజ్ఞలు భేఖాతరు చేస్తూ ఎర్రజొన్న రైతులు మామిడిపల్లి జాతీయ రహదారిపై బైఠాయించారు. వివిధ గ్రామాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడం తో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.