చేసినపాపాలకు ప్రాయశ్చిత్తం ఏ నాటికైనా తప్పదు అదే కర్మ సిద్ధాంతంకావచ్చు. అధికారంచేతిలోఉన్నప్పుడు తామేమి చేసిన చెల్లి పోతుందనే ధీమా ప్రధాన రాజకీయ పార్టీలలో మితిమీరి పోయింది. ప్రజాప్రయోజనాల కోసం పనిచేయాలిసిన రాజ్యాంగ వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకోని స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడం….ముందుగా ప్రత్యర్థులను బెదరగొట్టడడం కుదిరితే దారిలోకి తెచ్చుకోవడం లేదంటే రాజకీయంగా వెన్ను విరవడం వంటివి ఇందిరాగాంధీ దేశప్రధాని అయ్యాక మొదలయి మోడీ హయం దాక కొనసాగుతున్నాయి. ప్రాంతీయ పార్టీలప్రాబల్యం పెరిగితె తమ రాజకీయ మనుగడ కష్టం అవుతుందనే ఆలోచనతో ప్రజాస్వామ్య బద్దంగా కొలువు దీరిన ప్రభుత్వాలను ఆర్టికల్ 356 అడ్డం పెట్టుకొని గవర్నర్ ల ద్వారా రద్దు చేసే పక్రియను మొదలు పెట్టింది కాంగ్రెస్ కదా???ప్రాంతీయ పార్టీలవల్ల తమ ప్రాబల్యం తగ్గిపోతుందనే బెంగ జాతీయ పార్టీలకు అప్పటినుంచో ఉంది.

తాము చేసే తప్పిదాలను గతంలో ప్రత్యర్ధులు చేసినవాటితో పోల్చుకోవడం తమల్ని తాము శుద్ధపూసలుగా చెప్పికోవడం వర్థమాన రాజకీయాల్లో షరా మామూలైంది.ఇప్పుడు కర్ణాటక లో గవర్నర్ చర్యపై ప్రజాస్వామ్యమే ఖునీ అయ్యిందని గగ్గోలో పెడుతూ నైతిక విలువలను వల్లిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాము కేంద్రంలో అధికారంలో ఉండగా ఎన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఖునీ చేయలేదు. అసలు ప్రాంతీయ పార్టీలను అణిచివేసే ధోరణి మొదలయ్యిందే ఇందిరా హయాంలో కదా కేరళలో నంబూద్రి ప్రభుత్వాన్ని ఎంత నిర్దాక్ష్యనియంగా రద్దుచేశారు. కేవలం విద్యా బిల్లు ఫై మొదలైన ఆందోళనలను సాకుగా చూపి అప్పటి గవర్నర్ ను ఒత్తిడి చేసి మరి అయన సిపారిసు తో తమ కార్యని నెరవేర్చు కున్నారు అంతెందుకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ పార్టీ పెట్టి తొమ్మిది నెలలకే అధికారంలోకి రావడాన్ని అప్పటి ప్రధాని ఇందిరా జీర్ణించుకోలేదు అయన వైద్యం కోసం అమెరికా వెళ్ళగానే గవర్నర్ ను రంగంలోకి దించ భాస్కరరావును సీఎం గా చేసారు.

కానీ ఎన్టీఆర్ మొండోడు కదా మళ్ళీ సీఎం అయ్యేదాకా ఉద్యమించాడు కానీ దిన్నేమి కాంగ్రెస్ పార్టీ గుణపాఠంగా తీసుకోలేదు. ఆతర్వాత కూడా గవర్నర్ లను అడ్డంపెట్టుకొని అనేక మార్లు ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసారు .బీహార్ లో రజ్వి జార్ఖండ్ లో బూటాసింగ్ లు గవర్నర్ లు ఉన్నప్పుడు ఏమైంది?కాంగ్రెస్ ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసలు రాష్ట్ర గవర్నర్ ఎన్నికల తర్వాత ఏ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు కోసం పిలవాలి ఎలాంటి పరిస్థితిలో ఏ విధానాన్ని అనుసరించాలో 2007 ఏర్పాటైన సర్కారియా కమిషన్ ఎన్నో కీలక సూచనలు చేసింది. సుప్రీం కోర్టు లో ను జస్టిస్ మదన్మోహన్ అధ్యక్షత తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం వీటిని ఆమోదించింది. అదీగాక ఇదే కర్ణాటక లో ఎస్ ఆర్ బొమ్మై విషయంలోనూ సుప్రీం కీలకమైన ఆదేశాలు జారీచేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన ఈ వికృత క్రీడను కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చిన నిసిగ్గుగా ఆడుతూనే ఉన్నారు.

కర్ణాటకలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని రంకెలేస్తున్న దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి శంకర్ వాఘేలా ను గద్దెనెక్కినఁచారు కదా.ఇప్పుడు ప్రధాని చేస్తోంది అదే కానీ దేశంలో అన్ని వ్యవస్థలనువాడుకొని రాజకీయప్రయోజనాలు పొందినవారిలో మోడీ ని మించినవారే ఉండరు. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలమీద దాడులు చేయించడంతో పాటు వారు అధికారంలోకి రాకుండా నిలువరించడం కోసం గవర్నర్ వ్యవస్థను వాడుకున్నారు.తమిళనాడులో జయ మృతి తర్వాత శశికళ సీఎం కావాలిసింది కానీ ఆమెను పాత కేసు లో జైలు కు పంపి సీఎం కుర్చీ దక్కకుండా చేసారు. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పార్టీ జంప్ చేసి బీజేపీ లోకి వచ్చేలా అక్కడి గవర్నరే చక్రం తిప్పాడట ఎన్నికల్లో ప్రజలు అందలం ఇవ్వకపోయినా గోవా, మణిపూర్ లలో గవర్నర్ లను అడ్డం పెట్టుకొనే దొడ్డిదారిలో అధికారం లోకి వచ్చేసారు.ఇప్పుడు కర్ణాటక లోనూ మళ్ళీ అదే కథ పునరావృత్తం అవుతుంది.