రెండు తెలుగు రాష్ట్రాల చిచ్చు రేపి నిప్పు లాంటి బాబుఫై మచ్చ పడేలా చేసిన ఓటుకు నోటు కేసు మరోసారి తెర మీదికి వచ్చింది. ఈసారి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ఈకేసు ను రివ్యూ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన రాజకీయ అవసరాల కోసమే కెసిఆర్ఈకేసును తెర మీదికి తెచ్చి నట్లుగాభావించారు. మొన్నటి దాక బాబు కు కేంద్రంతో మంచి సంబంధాలు ఉండే అందుకే అతని జోలికి వెళ్ళ లేక పోయారు అందులోనూఈకేసులోకేంద్రమే జోక్యం చేసుకొని కెసిఆర్ని వారించినట్లుగా గతంలో ప్రచారం అయ్యింది. అందువల్లే కెసిఆర్ ఓటుకు నోటు కేసులో వెనక్కి తగ్గారు. ఆ తర్వాతే ఇద్దరు చంద్రులు ఒక్కటి అయ్యారు. రెండు రాష్ట్రాల మద్య స్నేహ సంబంధాలు మొదలయ్యాయి. కానీ సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈకేసు మరోసారి తెర మీదికి వచ్చింది.

బీజేపీ తో తెగదెంపులు చేసుకొని ఏపీ కి జరుగుతున్న అన్యాయం ఫై నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు గొంతెత్తిన చంద్రబాబు ఇక మోడీ తాడోపేడో తేల్చుకునే పనిలో ఉన్నారు. మరోసారి దేశరాజకీయాలను ఒంటిచేత్తో గిరగిరా తిప్పడానికి సిద్ధం అవుతున్నారు . అబ్బో అయన తాలూకు మీడియా చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు.ఏపీలో హోదా కోసం మొదలైన పోరులో తాను హీరో అయి మోడీ ని విలన్ చేసే ఎత్తుగడ లో బాబు ఉన్నారు. ఇదంతా పక్కనబెడితె అసలు బాబు లక్ష్యంగా చేసుకొనే మోడీ ఎదో చేస్తున్నారని బాబుకు సమాచారం ఉంది. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ అగ్రనేతలంతా బిజీ గా ఉండిపోవడంతో ఫలితాల తరువాతే ఏదైనా ఉండొచ్చని ప్రచారం జరిగింది.కేంద్రం ఎప్పుడైనా తనపై పడవచ్చని టీడీపీ నేతలు ఆందోళనతో ఉన్నారు.

కానీ బీజేపీ నాయకత్వం చాల ప్రతిష్ఠాతంగా భావిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేకంగా టీడీపీ పెద్దమొత్తంలో ప్రచారంలోకి దిగింది. అక్కడ పోలింగ్ కు వారం ముందే కెసిఆర్ ఓటుకునోటు కేసు ను బయటకి తీసారు. ఎలాగో సుప్రీం కోర్ట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి కదా తొందరగా తేల్చాలని అదీగాక బాబు వాయిస్ ను ఫోరెన్సిక్ కూడా నిర్దారించింది. ఆ నివేదిక ఆధారంగా ఈ కేసు లో తదుపరి చర్యలు మొదలు పెట్టాలని కెసిఆర్ ఆలోచనగా ఉందట. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల కు సంబందించిన కేసులను సైతం తిరగదోడే పనిలో తెలంగాణ సర్కార్ ఉంది. కానీ కెసిఆర్ స్వతహాగా ఈకేసు బయటకి తీయలేదనిచెప్పుతున్నారు. బీజేపీ అగ్రనేతలే కెసిఆర్ ను ముందు పెట్టి బాబు పని పట్టాలని చూస్తున్నారని రాజకీయవర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఎలాగో ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రభుత్వం కొలిక్కి తేవాల్సిన పరిస్థితి ఉందికదా. అందుకే కేంద్రం ఈ కేసు తోనే బాబు వెంటాడాలని చూస్తున్నట్లుగా ప్రచారం అవుతుంది.