బయటకు పొక్కడం లేదు కాని ఎదో బలమైన కారణంతోనే ఢిల్లీనీ ఢీ కొట్టడానికె తెరాస అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సర్వశక్తులతో సిద్ధం అవుతున్నారు దేశ రాజకీయాల్లో మార్పు జరగాలని ఆయనే కుండబద్దలు కొట్టారు . నాడుఎన్టీఆర్ తరహా లోనే కొత్త రాజకీయవేదికఫై దృష్టి పెట్టారా?ఆదిశగానే అయన అడుగులు వేస్తున్నారా? మోడీ సర్కారు ఫై సమరానికి శనివారమే శంఖారావంపూరించారు. దేశంలో కొత్త రాజకీయ సమీకరణలకు సిద్ధమవుతున్నారు. దేశరాజకీయాల్లో మార్పురావాలని భావిస్తున్నారు.

4ఏళ్ళుగాకేంద్రంతో సానుకూలధోరణితో ఉన్నారు కానీ అయనఆశించిననట్లుగా మోడీ నుంచి సహకారం రాలేదు. అందుకే కెసిఆర్ నాడు ఎన్టీఆర్ తరహాలోనే థర్డ్ ఫ్రాంటు ఏర్పాటు కావాలని భావిస్తున్నారు ఈ విషయాన్ని ఆయన బహాటంగానే చెప్పారు. కేంద్రంలో అధికారం తమ చేతిలో ఉంటేగాని రాష్ట్రాన్ని పుష్కలంగా నిధులు రావని కెసిఆర్ భావిస్తున్నారు అందుకే కొత్త సమీకరణలకు తెరలేపారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాగో తెరాస మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని బలంగా నమ్ముతున్నా ఆయన రాష్ట్రంలోప్రభుత్వపగ్గాలు తనయుడు కేటీఆర్ కు అప్పగించి తాను దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలని కెసిఆర్ యోచిస్తున్నారు .

అందుకే మూడోఫ్రంట్ కు నాయకత్వం చేయాలిసివస్తే నేను రెడీ!నాఅవసరం ఉంటే ఖచ్చితంగా సేవల అందిస్తాఅని కెసిఆర్ ప్రకటించారు.ఇదే ఇప్పుడు రాష్టంలో హాట్టాపిక్ అవుతుంది తెలంగాణగర్వపడేలా పనిచేస్తాం దేశంలోనెలకొన్న పరిస్థితులను కెసిఆర్ వివరించారు అసలు బ్రహ్మపుత్ర గంగా నదుల్లోఅందుబాటులోఉన్న ఉన్న నీటినిఅందుబాటులోకి తెస్తే తాగు-సాగు నీటి సమస్యే వుండదనిచెప్పారు అంటే తనకు దేశంలోఉన్న సమస్యల ఫైఅవగాహన ఉందనే సంకేతాలుఇచ్చారు పనిలోపనిగామన శత్రుదేశం చైనాలోఅభివృద్ది శరవేగంగా జరుగుతుందని మోడీ ఓరకంగా దెప్పిపొడిచారు కెసిఆర్ మాటల్లో వాడివేడి చూస్త అయన ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధంఅవుతున్నట్లుగానే భావించాలి ఇందుకుసంబంధించి కొంత గ్రౌండ్ వర్క్ జరిగాకే కెసిఆర్ శనివారం ఓపెన్ అయినట్టున్నారు.

కాంగ్రెస్,బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఢిల్లీలో థర్డుఫ్రంట్ ఫై మళ్ళీ ఆశలు చిగురించాయి.తనతో కలిసివచ్చే వారుఎవరెవరో కెసిఆర్ కు పక్కగా తెలుసు అందుకే దైర్యంగాఅడుగు ముందుకు వేశారు. మోడీతో ఢీ కొంటున్న మమతా.లాలూ ములాయం,నవీన్పట్నాయక్ కరుణానిధి,చంద్రబాబు లాంటి నేతలు కెసిఆర్ తో చేతులు కలిపేఅవకాశాలు ఉన్నాయి.కెసిఆర్ సంబంధితనేతలతో టచ్ లోనూఉన్నట్టున్నారు. గతంలోటీడీపీ అధినేత ఎన్టీఆర్ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వైఖరితో విసిగిపోయారు. తననుముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ఫై కక్ష్య తో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసారు అప్పటినుంచే సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయింది.కానీ ఆ ఫ్రంట్ ఎక్కవకాలం మనగడ సాధించలేదు మళ్ళీ ఇప్పుడు కెసిఆర్ తెగువతో థర్డ్ ఫ్రంట్ కు బీజం పడింది. రాజకీయాల్లో ఎత్తుకు ఫై ఎత్తులు వేయడంలో కెసిఆర్ ఆరితేరిపోయారు.

అనుకున్నదిసాధించడానికి మొండిగా ముందుకు వెళ్లడంకెసిఆర్ నైజం. అలాగే ఎంత స్నేహం చేస్తాడో ఆంతే వైరం పెంచుకుంటాడు. చంద్రబాబు లాంటి ఉద్దండులే కెసిఆర్ ఎత్తులకు బొక్కబోర్లా పడ్డారు. ఎంపీ,కేంద్రమంత్రిగా పనిచేసిన టైంలోదేశ రాజకీయాలపై పట్టు సాధించారు ఉద్యమకాలంలో అన్నిపార్టీలను ఒప్పించారు . అప్పుడే అన్నిపార్టీలలోని కీలక నేతలతో దోస్తానా ఉంది ఇప్పడుఅవన్నీ కెసిఆర్ కు అక్కరకువస్తాయి. మోడీమానియాతగ్గి పోతుంది అలాగని కాంగ్రెస్ పార్టీ కనీసం పుంజుకోవడంలేదు కాబట్టి 2019సాధారణ ఎన్నికలో థర్డ్ ఫ్రంట్ కుఆదరణ ఉంటుందని కెసిఆర్ భావిస్తున్నారు.