ఈపాటికే తెలుగు మీడియా ఫై బాహాటంగా నిప్పులు చెరుగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత మీడియా కోసం సన్నాహాలు చేస్తున్నారు . ముందుగా ఓ టీవీని సమకూర్చుకునే పనిలో ఉన్నారట.  తనకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తే టీవీ కి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తున్నాడని సమాచారం. గతంలో తులిసి ఛానల్ ను టేకోవర్ చేయాలనుకున్న పవన్ చివరిలో వెనక్కి తగ్గారు ఆ తర్వాత నెంబర్1 ఛానెల్ స్వతహాగా పవన్ కు అండగా ఉండాలని భావించింది కానీ నిప్పు బాబు తాలూకు మీడియా వెంటబడి కాపు ఉద్యమంలో తొక్కేసింది. కాపు సామజిక వర్గానికి చెందినసదరు యజమాని ముద్రగడకు మద్దతు ఇవ్వడం మీడియాకు నచ్చలేదు. అంతే కొద్దిరోజులకే మూత పడింది. మొదట ఈ ఛానెల్ తీసుకోవాలని భావించిన పవన్ ఏ ముద్రలేనిటీవీ అయితేనే మంచిదనే ఆలోచనతో ఉన్నాడట.

ఎప్పటికిప్పడు కొత్త టీవీ ఏర్పాటు సాధ్యమయ్యే పనికాదని ఎదో మూలాన పడిపోయినటీవీ ని కొత్త పేరు తో మొదలు పెట్టె ఆలోచనతో ఉన్నాడట ఇందులో భాగంగానే కమ్యూనిస్ట్ చేతిలో పడి నలిగి పోయిన 99 టీవీ ని టేకోవర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం. ఈ నెలఖారు లోగ ఈ కసరత్తు కొలిక్కి వస్తదని జనసైనికులుసంబర పడుతున్నారు. మీడియా సాగిస్తున్న అరాచకాలపై రగిలిపోతున్నపవన్ తన రాజకీయ అవసరాలకోసం సొంత మీడియా ఉండడం అనివార్యంగా భావిస్తున్నారు. రూపాయలుసమకూర్చే సినిమారంగానికి తాత్కాలికంగా గుడ్ బై చెప్పి పూర్తిస్థాయిరాజకీయాలపై దృష్టి పెట్టిన అయన రాబోయే సాధారణ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో పోటోచేయాలనే ఆలోచనతో ఉన్నారు ప్రధానంగా ఏపీ లో జనసేన పార్టీనే ప్రత్యామ్నాయంగా ఉంది.

బలమైన సామజిక వర్గం జనసేన కు అండగా నిల్చేఅవకాశంఉంది సో ఏపీపైనే పవన్ ఫోకస్ పెట్టారు. అందుకే టీడీపీ అగ్రనాయకత్వంఫై విరుచుకుపడుతున్నాడు. నాలుగేళ్లు చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిల్చిన పవన్ ఎట్టకేలకు తిరుగుబాటు చేసాడు అంతే నిప్పు తాలూకు మీడియారంగంలోకి దిగింది అమ్మ మా బాబు జోలికే వాస్తవ అంటూ పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని తన పైత్యాన్ని చూపెట్టింది శ్రీరెడ్డి ని అడ్డం పెట్టుకొని వెకిలి చేష్టలు వేసింది. ఎలాగో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ తన జోలికొచ్చిన మీడియా కె తగిన గుణపాఠం చెప్పాడు.మీడియా అధిపతుల బాగోతాలను బట్టబయలు చేసాడు వారు చెప్పే శ్రీరంగ నీతులను వెటకారం చేసాడు .నన్ను ఒక్కటి అంటే నేను..మిమ్మలిని పది అంట అని రెచ్చిపోయాడు.

మీడియా లో మరో నిప్పు రాధాకృష్ణ ఓ అడుగు ముందుకేసి పరువు నష్టం దావా వేసాడు. ఎంతో మంది పరువును బజారుకీడ్చే అయన మీడియా ఎట్టకేలకు పరువుకోసం పోరాటం తప్పదని గ్రహించింది ఇది మంచి పరిణామమే కదా…నిజానికి నిసిగ్గుగా మారిన మీడియాకి గుడుంబా శంకర్ లాంటి పవన్ కల్యాణే కరెక్ట్. ఇప్పటిదాకా సామజిక మాధ్యమాల ద్వారానే వీళ్ళ భరతం పట్టిన జనసేన అధినేత చేతికి సొంత మీడియా వస్తే ఎలా ఉంటుందో చూడాలి. గతంలో తన అన్న చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ సైతం ఇదే తరహాలో దెబ్బతీశారు చేతిలో సొంత మీడియా లేకపోవడం వల్లే ప్రజారాజ్యం ఎంతో నష్టపోయింది. ప్రతికూల పరిస్థితులను ఎదురుకుంది. అదే మీడియా మళ్ళీ అదే ఎత్తుగడలకు సిద్ధం అయ్యింది కానీ అనుభవాలనుంచి గుణపాఠం పొందిన పవన్ తన చేతిలోనూ ఓ మీడియా ఉండలని నిర్ణయించారు..