సాధారణఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత దూకుడు పెంచాడు. రాబోయేఎన్నికల్లో బరి లోకి దిగాలనే ఆలోచనతో ఉన్న అయన కార్యక్షేత్రంలోకి దిగాడు. పార్టీ మరింత విస్తరించే పనిలో ఉన్నాడు. ప్రజలతో మరింత మమేకంఅయ్యేవిదంగా ప్రణాళిలికను రూపొందించారు. శ్రీరెడ్డి వివాదం తర్వాత కొద్దీ రోజుల మౌనంగా ఉన్న పవన్ ఏపీ లో రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా మారుతాయని ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తుండడం తో అప్రమత్తం అయినట్లు సమాచారం . ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో ఏవో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కదా ఈ టైమ్ లో ప్రజల్లో ఉంటే రాజకీయం తనకు కొంతైన కలిసి వస్తుందనే పవన్ ఉన్నపలంగా రంగంలోకి దిగారు.

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే ఆలోచనతో ఉన్న అయన మొదట నియోజకవర్గాల ఇంచార్జ్ లను నియమించే కార్యని ఉన్నఫలం పూర్తిచేయనున్నారు.  గతంలో ప్రజారాజ్యం తాలూకు చేదు అనుభవాలు దృష్టి లో పెట్టుకొని ఇంచార్జి లను ఎంపిక చేస్తున్నారు ఇందుకోసం పవన్ ప్రత్యేక వ్యవస్థనే పెట్టుకున్నారు. అలాగే అత్యంత నిపుణులైన వారితో ఐటీ వ్యవస్థ ను అందుబాటులోకి తెచ్చుకున్నారు.పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడానికి అనుసరించాలిసిన వ్యూహాలను రూపొందించే పని వీరు చూస్తున్నారు. గుంటూరు సభ లో అధికారపార్టీ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలతో ఏపీ రాజకీయాలను ఒక్కసారి వేడేక్కించిన పవన్ మళ్ళీ కొంత కాలం గ్యాప్ తర్వాత ఏంట్రీ ఇచ్చారు.

ఈ సారి పవన్ తన రాజకీయ యాత్రకు తిరుపతి నుంచి శ్రీకారం చుట్టారు కాలినడకన వేంకటేశ్వరస్వామి దర్శించుకున్న తర్వాతే రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు.ఈపాటికే ఏపీ లోని అన్ని ప్రాంతాలనుంచి నివేదికలు తెప్పించుకున్నారు ఏఏ ప్రాంతాల్లో ప్రధాన సమస్యలు ఏమి ఉన్నాయనేది అవగాహనకు వచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి పర్యటన మొదలుపెట్టారు.ప్రసంగంలో ఎప్పటిలాగే వాడివేడి కనిపించింది. జగన్ పాదయాత్ర ముగించే ప్రాంతం నుంచే పవన్ తన రాజకీయ యాత్ర మొదలు పెట్టారు. మరో వైపుఅసెంబ్లీ ఎన్నికలకు ముందే సాధ్యమైంత మేరకు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకువలనేది జనసేన ఆలోచనగా ఉందట. అందుకే బలమైన నాయకులకు అన్వేషణకోసం ప్రత్యేక వ్యవస్థే రంగంలోకి దిగిందట. గతంలో ప్రజారాజ్యం తాలూకు చేదు అనుభవాలు ఇంకా పవన్ ను వెంటాడుతున్నాయట. అందుకే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరనేది ఈ వ్యవస్థే ఖరారు చేసే అవకాశం ఉంది.