రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే సారి మోడీ సర్కారుపై కాలుదువ్వడం ఫై ఎవరికి తోచింది వారు విశ్లేషిస్తూవచ్చారు. మొన్నటి దాక మోడీ సర్కారు ను పొగడ్తలతో ముంచెత్తిన వీరిలో వచ్చిన మార్పు ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. కానీ కెసిఆర్ ను మొదటనుంచి నీడలా వెంటాడు తున్న రేవంత్ సోమవారం బాంబు పేల్చారు అదేఇపుడు హాట్ టాపిక్ అయింది. రేవంత్ సంగతి తెలిసిందేకదా పక్క సమాచారంతో కుండబద్దలు కొట్టేస్తారు. కానీ ఈసారి తాను ఎంతో ఇష్టపడే బాబును ఈవివాదంలోకి లాగాడు.సరే….బాబువిషయం కాస్త పక్కన పెడుదాం కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన వెనుక దాగిఉన్న అసలు విషయాలను చెప్పాడు. వాటిలో నిజమెంత ?అబద్దం ?ఎంత అనేది తెరాస నిరూపించుకోవాలి. రేవంత్ చెప్పిన సోదంతా కాదుకానీ రెండు కీలక ఆరోపణలు చేసాడు. ఒకటి కెసిఆర్ ఇంటిలో ఆధిపత్యపోరు సంతోష్ ను ఎంపీ చేస్తే కేటీఆర్ ను సీఎం చేయాలని కెసిఆర్ కోడలు అలిగి వెళ్లిపోయారని. ఇప్పుడు కెసిఆర్ అదే పనిలో ఉన్నారట అలాగే కేంద్రం కెసిఆర్ ఫై సిబిఐ ని పురమాయించిందట అయన కేంద్ర మంత్రిగా ఉన్నపుడు జరిగిన అవకతవకలపై సిబిఐ పక్కా ఆధారాలు సేకరిస్తుందట. ఈ కేసులబూచిగా చూపే కెసిఆర్ ను ఆర్ ఎస్ ఎస్ పావుగా వాడుతుందట.

అందువల్లే మూడో ఫ్రంట్ తెరమీదికి తెచ్చాడని రేవంత్ అనుమానం. కెసిఆర్ మొన్నటి విలేకరుల సమావేశంలోనూ అదే చెప్పాడు తాను మిస్టర్ క్లిన్ ప్రతీ పైసా లెక్కచూపుతున్నామని చెప్పుకొచ్చారు. అలాగే తనను ముట్టుకుంటే భస్మము అవుతారని ఓ దమ్కీ కూడా ఇచ్చేసాడు?ఎన్.డి.ఏ నుంచి బాబు బయటకు వచ్చే పరిస్థితి ఉందట.అదే జరిగితె బీజేపీ కి చాలా ఇబ్బంది ఉంటదటా !కాబట్టి ముందే కెసిఆర్ తో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయిస్తే బాబుతో పాటు దేశం లోని ఇతర పక్షాలను అందులో చేర్చి తమకు అండగా ఉండేలా ఆర్ ఎస్ ఎస్ ఈ పన్నాగం వేసిందట.పనిలోపనిగా బాబుపైన ఓ రాయి విసిరాడు అయన రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొనే ఆలోచనతో ఉన్నాడట!ఎందుకంటే బీజేపీ తో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఎలాగో లేదు కెసిఆర్ తో టీడీపీ పొత్తు పెట్టుకొంటే ఏపీ లో మైనస్ అవుతుంది. అందువల్లే బాబు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపు తున్నాడట భవిషత్తులో ఏపీ కి నిధులు రావాలంటే యూపీఏ తో వెళ్తేనే మంచిదని బాబు బావిస్తున్నారట!కెసిఆర్ మూడో ఫ్రంట్ ఫై దుమారం చెలరేగుతున్న టైమ్ లో రేవంత్ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ సమీకరణలు మొదలవుతాయి. బాబు తెరాస తో జత కట్టే చాన్సులేదనే విషయం నిజమే అది ఏపీ ప్రజల్లో తెరాసవిషయంలో ప్రతికూల పరిస్థితులు రావచ్చు?