రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీయడం లో కెసిఆర్ తరువాతే ఎవరైనా.. తనంటే గిట్టని వారిని రాజకీయంగా దెబ్బతీయడాకి అన్ని ఎత్తులు వేస్తాడు .అసెంబ్లీ సమావేశాల తొలి రోజు చోటు చేసుకున్న ఘటనలో కాంగ్రెస్ పార్టీ ని పూర్తిగా ఆత్మరక్షణలో కి నెట్టిన కెసిఆర్ వారు ఎదురు దాడి మొదలు పెట్టకన్నాముందే మరో కోలుకోలేని దెబ్బ తీసాడు మొదటి రోజె కాంగ్రెస్ పార్టీ దీన్ని తిప్పికొట్టలేక పోయింది అందుకే కెసిఆర్ తన సహజ దూకుడిని కొనసాగించారు .

గుర్తుంది కదా పోయిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలిన రేవంత్ రెడ్డి ,సండ్ర లను సస్పెండ్ చేసాడు. ఈసారి కెసిఆర్ టార్గట్ మారింది నల్గొండ లో మున్సిపల్ చైర్మెన్ భర్త శ్రీనివాస్ హత్య తరువాత కోమటి రెడ్డి కెసిఆర్ తో పాటు అతని అంతరంగికుడు జగదీష్ ఫై పరుష పదజాలంతో తీవ్ర ఆరోపణలు చేసాడు . అసలు నయీమ్ కేసులోనే కోమటిరెడ్డి పని పట్టాలని ప్రభుత్వ పెద్దలు పోలీస్ శాఖను పురమాయించారు .కాని అయన ఎంత మాత్రం వెనక్కి తగ్గలేదు కాని అవతల ఎవరు ఉన్నారు …కెసిఆర్ లక్ష్యసాధనకోసం మొండిగా ముందుకే వెళ్లడం అయన నైజం సహజ ధోరణికూడా అదే పోతే కోమటిరెడ్డిని దెబ్బ తీయడానికి అసెంబ్లీ ని వేదికగా చేసుకున్నారు.

పనిలో పనిగా అల్లుడు హరీష్ తో ఎంత బుజ్జగించిన పార్టీ లోకి రాలేకపోతున్న సంపత్ ను ఓచూపు చూసాడు. మండలి చైర్మెన్ ఫై జరిగిన దాడి కెసిఆర్ లక్ష్య సాధనకు ఉపయోగపడింది. బలహీనవర్గాలకు చెందిన స్వామి గౌడ్ దాడి ఫైప్రభుత్వం చాల కఠిన ఉన్నట్లు లీకులు ఇచ్చింది ఇంకేమిఉంది ఇద్దరు శాసన సభ్యుల సభ్యత్వమే రద్దు చేస్త్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు అదీగాక మిగితా సభ్యులను క్షమించి ఎదో ఈ సమావేశాల వరకే సస్పెండ్ చేసారు . ఊహించని ఈ చర్యతో కాంగ్రెస్ పార్టీ విలవిలా లాడింది. ఎదో ఎదురు దాడి చేయబోయింది.

ఇది రాజ్యాగంవిరుద్ధమని స్పీకర్ కు అసలు అధికారమే లేదు . న్యాయ పోరాటం చేస్తాం అంటూ ఎవరికీ తోచి విధంగా వారు స్టేటుమెంట్లు ఇచ్చారు . స్పీకర్ ఆ అధికారం ఉందా లేదా కోర్టులో నిలబడుతుందా ? లేదా ఏవేవి కెసిఆర్ కు అక్కర లేనివి తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఏ ఛాన్స్ వదులుకోరు దటీజ్ కెసిఆర్!